బ్లాంక్ చెక్ ను అటు ట్రాన్స్ ఫర్ చేస్తాడట…

ntr

ప్రస్తుతం ఎన్టీఆర్ డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. అతడు సినిమాకు సై అనాలే కానీ, కోట్లకు కోట్లు సమర్పించుకోవడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు.మరికొందరు నిర్మాతలైతే ఎన్టీఆర్ కు బ్లాంక్ చెక్ ఆఫర్ చేస్తామంటున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం అలాంటి బ్లాంక్ చెక్ ను అట్నుంచి అటే ఇంకో చోటికి ట్రాన్స్ ఫర్ చేస్తానంటున్నాడు. నిర్మాతలంతా తనపై ఫోకస్ పెడుతుంటే…తారక్ ఫోకస్ మాత్రం మరో వ్యక్తిపై ఉంది. అతడు మరెవరో కాదు.. జనతాగ్యారేజ్ దర్శకుడు కొరటాల శివ.అవును.. కుదిరితే కొరటాలతో మరో సినిమా చేసేందుకు తారక్ రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ అయితే ఫ్రీగానే ఉన్నాడు. ఏ సినిమాకూ కమిట్ అవ్వలేదు. కానీ కొరటాల మాత్రం జనతా గ్యారేజ్ సెట్స్ పై ఉన్నప్పుడే కమిట్ అయిపోయాడు.

మహేష్ బాబుతో శ్రీమంతుడు తర్వాత మరో మూవీ చేయబోతున్నట్టు ప్రకటించాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు… ఆలస్యం చేయకుండా కొరటాలను మరోసారి తనవైపు తీసుకొస్తేనే బెటర్ అని భావిస్తున్నాడట తారక్. అందుకే మహేష్ మూవీ అయిపోగానే, మరోసారి కలిసి సిినిమా చేద్దామని కొరటాలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చాడట. కావాలంటే బ్లాంక్ చెక్ ఇస్తానంటున్నాడు ఎన్టీఆర్.ఎన్టీఆర్ ఆఫర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది. ఈమధ్యే కొరటాలకు ఓ కాస్ట్ లీ విల్లా కూడా కొనిచ్చాడట తారక్. ఇప్పుడు ఏకంగా బ్లాంక్ చెక్ ఆఫర్ చేస్తున్నాడనే టాక్ వైరల్ అయిపోయింది. అయితే దీనిపై అటు తారక్ కాంపౌండ్, ఇటు కొరటాల ఏమాత్రం స్పందించడం లేదు. మహేష్ తో మూవీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత దీనిపై ఓ క్లారిటీ వస్తుంది.

Loading...

Leave a Reply

*