బ‌ర్త్‌డే నాడే త్రివిక్ర‌మ్‌కి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన ఎన్టీఆర్‌…!

untitled-43

జ‌న‌తా గ్యారేజ్ వంటి సంచ‌ల‌న విజ‌యం త‌ర్వాత తార‌క్ ఖాళీగా ఉన్నాడు. ఆయ‌న మ‌రో మూవీని షురూ చెయ్య‌లేదు. ఎంద‌రో ద‌ర్శ‌కుల‌తో సినిమా ప్లాన్ చేసినా ఏదీ వ‌ర్క‌వుట్ కాలేదు. త్రివిక్ర‌మ్‌తోనూ ఆయన క‌లిసి సినిమా చెయ్యాల‌ని భావించాడు. అది కుద‌ర‌లేదు. ఇవాళ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ పుట్టిన‌రోజు. ఆయ‌న బ‌ర్త్‌డే నాడు తార‌క్ ఆయ‌న‌కు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చాడు.

బుల్లితెర‌పై త్రివిక్ర‌మ్ అ..ఆ, ఎన్టీఆర్‌.. జ‌న‌తా గ్యారేజ్ 24 గంట‌ల తేడాలో ప్ర‌సార‌మ‌య్యాయి. జ‌న‌తా గ్యారేజ్ చిత్రానికి ఏకంగా 20.36 టీఆర్‌పీ పొంది.. 2016లో ఇప్ప‌టిదాకా రిలీజ్ అయిన సినిమాల‌లో బెస్ట్ రేటింగ్ పొందిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. స‌రిగ్గా ఈ సినిమాకి ముందు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అ..ఆ ప్ర‌సార‌మ‌యింది. త‌క్కువ బ‌డ్జెట్‌తో వ‌చ్చిన ఈ సినిమా భారీ వ‌సూళ్లు పొందినా.. టీఆర్‌పీల ప‌రంగా కేవ‌లం 12 పొంద‌డం విశేషం. ఇదే ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ ఏడాది ఇప్ప‌టిదాకా విడుద‌ల‌యిన సినిమాల‌లో ది బెస్ట్ టీఆర్‌పీ జ‌న‌తా గ్యారేజ్‌దే. మ‌రే సినిమాకి ఇంత రేటింగ్ ద‌క్క‌లేదు. ఇలా, బ‌ర్త్ డే నాడే త్రివిక్ర‌మ్‌కు షాక్ ఇచ్చాడు తార‌క్‌.

 

Loading...

Leave a Reply

*