నిజంగానే ఎన్టీఆర్ గ్యాప్ తీసుకుంటాడా…

ntr

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పై కుప్పలుతెప్పలు వార్తలు వస్తున్నాయి. అవన్నీ నెక్ట్స్ సినిమాకు సంబంధించినవే. కొందరు పూరి డైరక్షన్ లో సినిమా చేస్తాడని రాసేస్తున్నారు. మరికొందరు తారక్ గ్యాప్ తీసుకుంటాడని రాసేస్తున్నారు. ఇప్పుడీ గాసిప్స్ కు బాబు లాంటి పుకారు ఒకటి మీడియాలో చక్కర్లు కొడుతోంది. అవును.. తారక్ ఈ ఏడాదే కాదు… వచ్చే ఏడాది కూడా సినిమా విడుదల చేయలేడట. దీనికి కొందరు గాసిప్ రాయుళ్లు తమదైన లాజిక్ కూడా వినిపిస్తున్నారు.

ప్రస్తుతం అందుకున్న సమాచారం ప్రకారం…తారక్ మరో 6నెలలు గ్యాప్ తీసుకుంటాడట. ఈ గ్యాప్ లోసినిమా ఎనౌన్స్ చేసినప్పటికీ… దాన్ని సెట్స్ పైకి తీసుకొచ్చేది మాత్రం వచ్చే ఏడాది మిడ్ లోనే అని తెలుస్తోంది. పైగా ఈ గ్యాప్ లో తన వ్యక్తిగత, వ్యాపార కార్యకలాపాలు పూర్తిచేయాలని అనుకుంటున్నాడట. సో… వచ్చే ఏడాది మధ్యలో సినిమా ప్రారంభిస్తే, అది పూర్తయ్యేసరికి కనీసం 5-6 నెలలైనా పడుతుంది. కాబట్టి 2017లో కూడా తారక్ నుంచి సినిమా థియేటర్లలోకి రాదనేది కొత్త లాజిక్.

ఈ లాజిక్స్ ఎలా ఉన్నప్పటికీ… తారక్ మాత్రం ప్రస్తుతం మౌనముని అయిపోయాడు. మీడియాకు కూడా కనిపించడం మానేశాడు. నిన్నగాక మొన్న జరిగిన ఇజం సక్సెస్ మీట్ కు తారక్ గెస్ట్ గా వస్తాడని అంతా అనుకన్నారు. కానీ ఆ కార్యక్రమానికి కూడా ఎన్టీఆర్ డుమ్మా కొట్టాడు. సో.. తారక్ నెక్ట్స్ ఏంటనేది ప్రస్తుతానికి పెద్ద పజిల్.

Loading...

Leave a Reply

*