కొరటాలకు ప్రేమతో…

ntr-readies-gift-for-koratala-for-janata-success

తారక్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ జనతా గ్యారేజ్. తారక్ ఎలాంటి హిట్ అందుకోవాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇన్నాళ్లూ ఎదురుచూశారో సరిగ్గా అలాంటి సినిమానే జనతా గ్యారేజ్. అటు ఎన్టీఆర్ కూడా ఎలాంటి సినిమాకోసం, ఎలాంటి ఛేంజ్ కోసం చూశాడో అలాంటి సినిమానే జనతా గ్యారేజ్. అందుకే ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన కిక్ తారక్ ను ఇంకా విీడలేదు. ఆ ఆనందంలో కొరటాలకు ఓ బడా గిఫ్ట్ కూడా రెడీచేశాడు ఎన్టీఆర్.

జనతా గ్యారేజ్ లాంటి సక్సెస్ ను తనకు అందించిన కొరటాలకు ఏకంగా ఓ ఇల్లును గిఫ్ట్ గా ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు ఎన్టీఆర్. అనుకున్నదే తడవుగా హైదరాబాద్ లోని ఓ కాస్ట్ లీ హౌజ్ లో ఓ ఇంటిని ప్లాన్ చేశాడు. ఈ విషయం పాతదే. కొరటాలకు గిఫ్ట్ రెడీచేసిన విషయం చాలామందికి తెలుసు. లేటెస్ట్ ఏంటంటే.. ఈ గిఫ్ట్ ఇప్పుడు పూర్తిగా రెడీ అయింది. రేపో మాపో కొరటాల చేతికి తారక్ ఇంటి తాళంచెవులు అందించబోతున్నాడు.

జనతా గ్యారేజ్ సక్సెస్ తర్వాత మరోసారి కొరటాలతో కలిసి పనిచేయాలనుకుంటున్నాడు ఎన్టీఆర్. కానీ కొరటాల మాత్రం మహేష్ సినిమా పనిలో పడ్డాడు. అందుకే మహేష్ మూవీ కంప్లీట్ అయిన వెంటనే.. మరోసారి కొరటాలతో కలిసి సినిమా చేసే అవకాశాన్నిీ సీరియస్ గా పరిశీలిస్తున్నాడు. ఈ మేరకు కొరటాలతో ఎన్టీఆర్ కూడా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.

Loading...

Leave a Reply

*