ల‌వ‌ర్ రేంజ్ అమాంతం పెంచిన తార‌క్‌…!

tarak

ఇదేంటి అనుకుంటున్నారా..? షాకింగ్ న్యూస్ అని కంగారు ప‌డుతున్నారా? అలాంటిదేమీ లేదు. నంద‌మూరి అభిమానుల‌కు ఇదో గుడ్ న్యూస్‌. మ‌రోసారి షాక్ అయ్యారా..? అవును,ఇది నిజం.ఇంత‌కీ తార‌క్ ల‌వ‌ర్ అంటే ఎవ‌ర‌నుకుంటున్నారు..? క‌ల్యాణ్ రామ్‌. ఇదేం లాజిక్ అనుకుంటున్నారా..? రీసెంట్‌గా జ‌రిగిన ఇజం ఆడియో ఫంక్ష‌న్‌లో తార‌క్‌.. క‌ల్యాణ్ రామ్ గురించి మాట్లాడుతూ.. ఆయ‌న త‌న అన్న‌య్య‌, మార్గ‌ద‌ర్శి, ఫ్రెండ్‌, ఫిలాస‌ఫ‌ర్‌, మెంటార్‌, ఫాద‌ర్‌తోపాటు త‌న ల‌వ‌ర్‌, గాళ్‌ఫ్రెండ్ అని కూడా అన్నాడు. అది అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది. ఇప్పుడు ఆ గాళ్ ఫ్రెండ్ మార్కెట్ బాగా పెరిగింది.

ఇజం సినిమాతో క‌ల్యాణ్‌రామ్ మార్కెట్ స‌డెన్‌గా పెరిగింది. తొలి రోజే ఏకంగా 3 కోట్లు క‌లెక్ట్ చేసింది ఇజం. రెండో రోజు కూడా మంచి వ‌సూళ్లు పొందింది ఈ చిత్రం. సినిమాకి పాజిటివ్ టాక్ రావ‌డంతో వ‌సూళ్లు మ‌రింత పెరుగుతున్నాయి. భారీ హిట్ దిశ‌గా ప‌రుగులు పెడుతోంది ఈ చిత్రం. ఇజం సినిమాని సెట్ చేసింది తార‌క్‌. పూరిలాంటి బ‌డా డైరెక్ట‌ర్ అయితే కల్యాణ్‌రామ్ కెరీర్‌కి ఊపు వ‌స్తుంద‌ని భావించిన తార‌క్‌.. ఈ సినిమాని సెట్ చేశాడు. క‌ల్యాణ్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డైరెక్ట‌ర్ పూరి. వారి కాంబినేష‌న్ అన‌గానే సినిమాకి ఆటోమేటిక్‌గా క్రేజ్ వ‌చ్చింది. ఊహించని రేంజ్‌లో ఓపెనింగ్స్ కూడా వ‌చ్చాయి. ఇలా, తార‌క్ త‌న ల‌వ‌ర్ రేంజ్‌ని అమాంతం పెంచేశాడు క‌దూ.

Loading...

Leave a Reply

*