కొర‌టాల‌కు కోటి రూపాయ‌ల డూప్లెక్స్ హౌస్‌.. ఎన్టీఆర్‌ గిఫ్ట్‌…!

koratala-siva

జ‌న‌తా గ్యారేజ్‌.. తార‌క్ కెరీర్‌ని, క్రేజ్‌ని అమాంతం మార్చేసిన సినిమా. నిన్న‌టిదాకా ఆయ‌న టాప్ 3 హీరోల‌లో లేడు. ప‌న్నెండేళ్లుగా స‌రైన బ్లాక్ బ‌స్ట‌ర్ కోసం ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నాడు. త‌న ఫేట్ మార్చే ద‌ర్శ‌కుడు, సినిమా కోసం ఆయ‌న మొహం వాచిపోయేలా, క‌ళ్లు కాయ‌లు కాచేలా చూశాడు. అలాంటి టైమ్‌లో జ‌న‌తా గ్యారేజ్‌తో తిరుగులేని స‌క్సెస్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు కొర‌టాల‌. టాలీవుడ్ ఆల్‌టైమ్ టాప్ 3 బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది జ‌న‌తా గ్యారేజ్‌.

ఈ ఆనందాన్ని కొర‌టాల‌కు గిఫ్ట్ రూపంలో షేర్ చేసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌. ఇప్ప‌టికే ఆ గిఫ్ట్ ఏంటో కూడా నిర్ణ‌యించుకున్నాడ‌ని స‌మాచారం. హైద‌రాబాద్‌లోని కాస్ట్‌లీ లొకేష‌న్‌లో ప‌లు హౌస్‌లు చూసిన ఆయ‌న త్వ‌ర‌లోనే ఆ ఇంటి తాళాల‌ను కొర‌టాల ఫ్యామిలీకి అప్ప‌గించాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ఇప్ప‌టికే కొర‌టాల‌కు మ‌హేష్‌.. ఖ‌రీద‌యిన బెంజ్ కార్ కొనిచ్చాడు. శ్రీమంతుడు వంటి స‌క్సెస్ ఇచ్చినందుకు 80ల‌క్ష‌ల కారును బ‌హుమ‌తిగా అప్ప‌గించాడు మహేష్‌. ఇప్పుడు ఎన్టీఆర్ వంతు. జ‌నతా గ్యారేజ్ స‌క్సెస్‌తో తార‌క్‌.. కొర‌టాల‌కు డూప్లెక్స్ హౌస్ రెడీ చేస్తున్నాడ‌ట‌. మొత్త‌మ్మీద‌, కొర‌టాల టైమ్ బావుంది. లేకుంటే ఏంటి.. యావ‌రేజ్ టాక్ తెచ్చుకున్న జ‌నతా గ్యారేజ్‌.. వ‌సూళ్ల పంట పండించ‌డ‌మేంటి..? ఈ రికార్డ్‌ల మాటేంటి..?

 

Loading...

Leave a Reply

*