ఇది ఫిక్స్‌… సింహంగా వ‌స్తున్న యంగ్‌టైగ‌ర్‌…!

untitled-1-copy

ఎన్టీఆర్ కొత్త సినిమా ఫిక్స్ అయిందా…? జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత దాదాపు మూడునెల‌లుగా ఖాళీగా ఉంటున్న తార‌క్‌.. త‌న కొత్త చిత్రంపై ఓ క్లారిటీకి వ‌చ్చాడా..? ఆ మూవీ గ్రాఫ్‌ని ప‌డిపోకుండా చూసుకునే స్కెచ్‌ను వేస్తున్నాడు యంగ్‌టైగ‌ర్‌. అందుకే, గ‌తంలో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌లు, కొత్త ద‌ర్శ‌కుల‌కు కూడా చాన్స్‌లు ఇచ్చిన తార‌క్‌.. తాజాగా రూట్ మార్చాడు. ప‌క్కాగా స్క్రిప్ట్ న‌చ్చితేనే ఓకే అంటున్నాడు. అందుకే, ఆయ‌న సైలెంట్‌గా ఉన్నాడు ప్ర‌స్తుతానికి.

ఇటీవ‌ల తార‌క్ ఓ సినిమాకి ఫిక్స్ అయ్యాడ‌నే రూమ‌ర్ మ‌రోసారి టాలీవుడ్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. జ‌న‌తా గ్యారేజ్ స‌క్సెస్‌తో తార‌క్ ప‌క్కా మ‌స్ మూవీ చెయ్యాల‌ని భావిస్తున్నాడు. త‌న ఇమేజ్‌కి, ఫ్యాన్స్ ఆలోచ‌న‌ల‌కి క‌నెక్ట్ అయ్యే క‌థ కోసం ఆయ‌న వెయిట్ చేస్తున్నాడు. అందుకే, అనిల్ రావిపూడి వంటి డైరెక్ట‌ర్‌లు ప్ర‌యోగాత్మ‌క క‌థ‌లు చెప్పినా, ద‌ర్శ‌కేంద్రుడు ఫాంట‌సీ స్టోరీ అయినా నో చెప్పాడు. ఇటు పూరి జ‌గ‌న్నాధ్‌కి కూడా వెయిట్ చెయ్య‌మ‌ని అన్నాడు. ఎన్టీఆర్ కొత్త సినిమా గురించి ఇప్పుడు ఓ ఇంట్ర‌స్టింగ్ వినిపిస్తోంది.

నంద‌మూరి హీరోల‌కి బాగా క‌లిసొచ్చిన సింహం స్ట‌యిల్ మూవీలో న‌టించేందుకు ఇప్ప‌టికే స్కెచ్ గీశాడ‌ట తార‌క్‌. త‌మిళ్ హీరో సూర్య‌తో సింగ‌మ్, య‌ముడు, సింగ‌మ్ 3 వంటి సింగ‌మ్‌ సిరీస్ చిత్రాల‌తోపాటు… విశాల్‌తో పూజ వంటి చిత్రాల‌ను డైరెక్ట్ చేసిన డైరెక్ట‌ర్ హరితో సినిమాకి రెడీ అవుతున్నాడ‌ట తార‌క్‌. మ మ మాస్ సినిమాల‌కి, టైట్ అండ్ ఫాస్ట్‌ స్క్రీన్‌ప్లే, హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌ట‌యిన‌ర్‌ల‌కి ఆయ‌న బాగా ఫేమ‌స్‌. అందుకే, హ‌రితో ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా ముగించాడ‌ట తార‌క్‌. ప్ర‌స్తుతం సింగమ్ 3తో బిజీగా ఉన్న హ‌రి.. త్వ‌ర‌లో ఈ సినిమాని లాంచ్ చెయ్య‌నున్నాడ‌ని తార‌క్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదే క‌నుక నిజ‌మ‌యితే.. తార‌క్‌కి త‌మిళ్‌లోనూ క్రేజ్ రావ‌డం గ్యారంటీ. ఎన్టీఆర్ స్కెచ్ అదిరింది క‌దూ…!

Loading...

Leave a Reply

*