ఎన్టీఆర్ సినిమా ఫిక్స్ అయింది.. డైరెక్ట‌ర్ అత‌డే..!

ntr

కొన్నాళ్ల నుంచి సాగుతున్న రూమ‌ర్‌కి చెక్‌ప‌డింది. జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత తార‌క్ చెయ్య‌బోయే సినిమాపై ఓ క్లారిటీ వచ్చింది. జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత తార‌క్ ఏ మూవీకి క‌మిట‌వుతాడా? ఏ డైరెక్ట‌ర్‌కి క‌మిట‌వుతాడా? అనేది ప‌జిల్‌గా మారింది. ఆ సినిమా త‌ర్వాత యంగ్‌టైగ‌ర్ బిజినెస్ పెరిగింది. సో.. దాని త‌ర్వాత చెయ్య‌బోయే మూవీ అంత‌కంటే బిగ్ హిట్ కావాలి. అప్పుడే ఆయ‌న మార్కెట్ నిల‌బడుతుంది. లేదంటే రేస్‌లో వెన‌క‌బ‌డ‌డం ఖాయం. అందుకే, జ‌న‌తాగ్యారేజ్ త‌ర్వాత తార‌క్ నెల‌న్న‌ర పాటు కొత్త సినిమాని లేట్ చేశాడు.

ఇన్నాళ్ల‌కు ఆయ‌న త‌న సినిమాని ఫిక్స్ చేశాడు. పూరి జ‌గ‌న్నాధ్‌కే ఓటేశాడు. నిన్న‌మొన్న‌టిదాకా త్రివిక్ర‌మ్ కోసం ఈగ‌ర్‌గా వెయిట్ చేసిన తార‌క్‌.. ఆయన నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రాక‌పోవ‌డంతో.. ఫైన‌ల్‌గా పూరిని ఎంచుకున్నాడు. వక్కంతం వంశీ క‌థ చెప్పినా.. అది న‌చ్చ‌క‌పోవ‌డంతోనే పూరికి క‌మిట్ అయిన‌ట్లు సమాచారం. పూరి క‌థ‌ను కొన్ని రోజుల ముందే విన్నాడు యంగ్‌టైగ‌ర్‌. దాదాపు నెల రోజుల తర్వాత ఆ స్టోరీకి ప‌చ్చ‌జెండా ఊపాడు తార‌క్‌. ఇది పూర్తిగా సెంటిమెంట్ బేస్డ్ మూవీ అట‌. నిన్న‌టిదాకా ఫ్యామిలీ ఎంట‌ర్‌ట‌యిన‌ర్ చేయాల‌ని భావించిన తార‌క్‌.. జ‌నతా గ్యారేజ్ స‌క్సెస్‌తో మ‌న‌సు మార్చుకున్నాడు. ప‌క్కా మాస్ ఎంట‌ర్‌ట‌యిన‌ర్‌ని చెయ్యాల‌ని భావించాడు. అందుకే, పూరికి ఓటేశాడ‌ట యంగ్‌టైగ‌ర్‌.

తార‌క్‌-పూరి కాంబినేష‌న్‌లో ఇప్ప‌టిదాకా రెండు సినిమాలు వ‌చ్చాయి. ఆంధ్రావాలాతోపాటు, టెంప‌ర్ వ‌చ్చాయి ఈ కాంబోలో. ఆంధ్రావాలా ఫ్లాప్ అయినా.. టెంప‌ర్‌తో తార‌క్ ఫేట్ మారింది. ఆ సినిమా నుంచి యంగ్‌టైగ‌ర్ మాస్ ఇమేజ్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. అందుకే, పూరికే ఓటేశాడ‌ట. న‌వంబ‌ర్ స్టార్టింగ్‌లోనే ఈ చిత్రం సెట్స్‌పైకి రానుంది. మ‌రి, ఈ కాంబో మూడోసారి ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి.

Loading...

Leave a Reply

*