తార‌క్‌ని బ‌రువు పెర‌గ‌మ‌న్న డైరెక్ట‌ర్ ఎవ‌రు..?

untitled-67

ఎన్టీఆర్ ను ఇప్పుడు ఎవరు చూసినా ముచ్చటపడతారు. అతడి లుక్స్, స్టయిల్స్ అందర్నీ బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. కానీ సరిగ్గా 6-7 ఏళ్ల కిందట ఎన్టీఆర్ ను ఒక్కసారి ఊహించుకుంటే మాత్రం మైండ్ బ్లాక్ అవుతుంది. అప్పట్లో ఎన్టీఆర్ ఎలా ఉండేవాడో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా రాఖీ, సాంబ, నా అల్లుడు లాంటి సినిమాల్లో ఎన్టీఆర్ ఫిజిక్ చూసి ఈడు యూత్ ఏంట్రా అనుకున్నారు చాలామంది. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామంటే.. తారక్ ఇప్పుడు మరోసారి ఆ సినిమాల్లో కనిపించినట్టు మారబోతున్నాడట.ప్ర‌స్తుతం తార‌క్ ఓ మాస్ మూవీ చేసే ఆలోచ‌న‌లో ఉన్నాడు. సో.. ఆయ‌న అర్జెంట్‌గా ఓ 10-12 కేజీలు బ‌రువు పెరిగే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. బాగా బరువు పెరిగి, భారీకాయంతో ఓ మాస్ సినిమా చేయాలని అనుకుంటున్నాడట తారక్.

నిజానికి ఇలాంటి ఆలోచనలు తారక్ కు నాన్నకు ప్రేమతో సినిమా నుంచే కలుగుతున్నాయి. స్టోరీ సెలక్షన్ లో, గెటప్ లో , క్యారక్టరైజేషన్ లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాడు తారక్. నాన్నకు ప్రేమతో సినిమాలో గడ్డం, ఆ స్టోరీలైన్…. జనతా గ్యారేజ్ లో లుక్స్, ఆ స్టోరీలైన్… ఇలా చూసుకుంటూ పోతే తారక్ మైండ్ సెట్ బాగానే మారిపోయినట్టు కనిపిస్తోంది.అందుకే తన కొత్త సినిమా కోసం విక్రమ్, కమల్ హాసన్ లాంటి నటుల తరహాలో తను కూడా ఫిజిక్ తో ప్రయోగాలు చేయాలనుకుంటున్నాడట తారక్. అందుకే అమాంతంర 10-12 కిలోలు పెరగాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఇది ఎవరి దర్శకత్వంలో రాబోతుున్న సినిమా అనేది మాత్రం తెలీదు.

Loading...

Leave a Reply

*