అక్క‌డ కూడా జ‌న‌తా గ్యారేజ్‌ రికార్డులు రిపేర్ చేస్తుందా..?

janatha-garage

జ‌న‌తా గ్యారేజ్‌.. ఇచ్చ‌ట అన్నీ రిపేర్‌లు చెయ్య‌బ‌డును. ఈ క్యాప్ష‌న్‌తో ఏకంగా తార‌క్ కెరీర్ రికార్డుల‌ను మొత్తం తిర‌గ‌రాసింది. ఆ త‌ర్వాత టాలీవుడ్ ఆల్‌టైమ్ సెకండ్ బెస్ట్ రికార్డ్‌లు కూడాతిర‌గ‌రాస్తుంద‌ని భావించారంతా. కానీ, కేవ‌లం రెండు కోట్ల తేడాతో శ్రీమంతుడు వ‌సూళ్ల‌ను అందుకోలేక‌పోయింది జ‌న‌తా గ్యారేజ్‌. దాదాపు 82కోట్ల క‌లెక్ష‌న్లు సాధించింది ఈ చిత్రం.

అయితే, ఈ సినిమాని ఇప్పుడు బుల్లితెర‌పై ప్ర‌ద‌ర్శిస్తున్నారు. మా టీవీ ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను ఫ్యాన్సీ ఆఫ‌ర్‌కి పొంతం చేసుకుంది. సుమారు 11 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. దీంతో, ఆ మ‌నీని తిరిగిపొందాలంటే జ‌న‌తా గ్యారేజ్ హీట్‌ని క్యాష్ చేసుకోవాల‌ని భావిస్తోంది మా టీవీ యాజ‌మాన్యం. అందుకే, సినిమా విడుద‌ల‌యిన రెండు నెల‌ల‌కే స్మాల్ స్క్రీన్‌పై టెలికాస్ట్ చేసేందుకు రెడీ అవుతోంది మా టీవీ. దీపావ‌ళి కానుక‌గా జ‌న‌తా గ్యారేజ్ బుల్లితెర‌పై ప్ర‌సారం కానుంది.

జ‌న‌తా గ్యారేజ్ భారీ స‌క్సెస్‌కావ‌డంతో పాటు దీపావ‌ళి సీజ‌న్ కూడా క‌లిసి రావ‌డంతో ఆ సినిమా అంచ‌నాల‌ను మించి టీఆర్పీల‌ను సొంతం చేసుకుంటుందని భావిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌ల‌యిన అన్ని చిత్రాల‌ను మించి తార‌క్ చిత్రానికి హ్యూజ్ డిమాండ్ ఉంటుంద‌నే బెట్టింగ్‌లు న‌డుస్తున్నాయి. రెండేళ్ల క్రితం టెంప‌ర్ సినిమాకి సుమారు 26 టీఆర్పీలు వ‌చ్చాయి. అది ఓ రికార్డ్‌. ఇప్పుడు దానిని మించి వ్యూయ‌ర్‌షిప్‌ని సొంతం చేసుకుంటుంద‌ని తార‌క్‌తోపాటు సినిమా యూనిట్ కూడా కాన్‌ఫిడెంట్‌గా ఉంది.

గ‌త రెండేళ్లుగా యూత్‌లో, ముఖ్యంగా సోషల్ మీడియాలో తార‌క్ ప్ర‌భంజనం మొద‌ల‌యింది. ఆయ‌న సినిమాల‌కి యూ ట్యూబ్‌లో భారీ హిట్స్ ప‌డుతున్నాయి. జ‌న‌తా గ్యారేజ్‌కి ప‌వ‌న్‌; మ‌హేష్ చిత్రాల టీజ‌ర్‌ల కంటే మంచి రెస్పాన్స్ రావ‌డం విశేషం. అందుకే, దీపావ‌ళికి భారీ టీఆర్పీలు వ‌స్తాయ‌ని ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. దీనిని క్యాష్ చేసుకోవడానికి మా టీవీ ఇప్ప‌టినుంచే ప్రోమోస్ రెడీ చేసింది. మ‌రి, థియేట‌ర్ల‌లో రికార్డులు రిపేర్ చేసిన జ‌న‌తా టీమ్‌… బుల్లితెర‌పైనా అదే మార్క్‌ని సొంతం చేసుకుంటుందా? లేదా? అనేది చూడాలి.

Loading...

Leave a Reply

*