లాభాలు పంచిపెడుతున్న జ‌న‌తా నిర్మాత‌.. తార‌క్‌కి మాత్రం నో..!

janata

జ‌న‌తా గ్యారేజ్ స‌క్సెస్ సాధించింది. అది ఓ కొత్త చ‌రిత్ర సృష్టించింది. టాలీవుడ్‌లో ఆల్‌టైమ్ టాప్ 3 బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒక‌టిగా నిలిచింది ఈ చిత్రం. దాదాపు పుష్క‌ర‌కాలం త‌ర్వాత తార‌క్‌కి బిగ్ హిట్ లేని కొర‌త‌ను తీర్చింది. ఇండ‌స్ట్రీ హిట్‌ను అందించింది యంగ్‌టైగ‌ర్‌కి జ‌న‌తా గ్యారేజ్‌. ఈ సినిమా అంచ‌నాల‌కు మించి లాభాల‌ను తెచ్చిపెట్టింది. చాలా చోట్ల నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను తిర‌గ‌రాసింది ఈ మూవీ. ఇక‌, బాహుబ‌లి త‌ర్వాత టాలీవుడ్‌లో అతిపెద్ద స‌క్సెస్‌గా నిలిచిన శ్రీమంతుడుకి, జ‌న‌తాకి మ‌ధ్య క‌లెక్ష‌న్ల విషయంలో గ్యాప్ 2-3 కోట్లు కూడా లేదు.

సినిమా ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మించి లాభాలు ఆర్జించ‌డంతో.. ఆ ప్రాఫిట్స్‌లో కొంత భాగాన్ని సినిమాలోని న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు పంచి పెడుతున్నార‌ట నిర్మాత‌లు. మైత్రీ మూవీస్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని న‌వీన్ ఎర్నేని, వై.నరేష్‌తోపాటు సీవీ మోహ‌న్ నిర్మించారు. ఈ ముగ్గురికే ఎన్టీఆర్ స‌ర‌దాగా జాన్‌, జానీ, జ‌నార్ధ‌న్ అని పిలుచుకుంటాన‌ని చెప్పారు. సినిమాకి మంచి లాభాలు రావ‌డంతో సినిమా విజ‌యంలో కీల‌క భూమిక పోషించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు ఒక్కొక్క‌రికి ప‌ది ల‌క్ష‌ల చొప్పున పంచి పెడుతున్నార‌ట ఈ నిర్మాత‌ల త్ర‌యం.

మ‌రోవైపు, శ్రీమంతుడుతో త‌మ‌ను లాంచ్ చేసి, జ‌న‌తా గ్యారేజ్‌తో త‌మ సంస్థ‌ను టాలీవుడ్‌లోని అతి పెద్ద ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ల‌లో ఒక‌టిగా చేసిన కొర‌టాల‌కు కూడా భారీగానే ఇస్తున్నార‌ట‌. అయితే, తార‌క్‌కి మాత్రం పైసా కూడా ఇవ్వ‌డం లేద‌ని అంటున్నార‌ట‌. ఈ సినిమా కోసం తార‌క్ మంచి గ్రౌండ్ వ‌ర్క్ చేశార‌ని, సినిమా స‌క్సెస్‌లో కీ రోల్ ఆయ‌న‌దే అని చెబుతున్నారు జ‌న‌తా నిర్మాత‌లు. అంతేకాదు, త‌మ‌కు తార‌క్ మాటిచ్చాడ‌ని, త్వ‌ర‌లోనే ఆయ‌న‌తో మ‌రో సినిమా చేస్తామ‌ని, అప్పుడు బ్లాంక్ చెక్ ఇస్తామ‌ని అన్నార‌ట. మొత్త‌మ్మీద‌, త‌న‌కు హిట్ రావ‌డం ఓ హ్యాపీ అయితే, త‌న సినిమా టీమ్ మెంబ‌ర్స్‌కి నిర్మాత‌లు ఇలా లాభాలు పంచిపెట్ట‌డం మ‌రో ఆనందమ‌ని.. ఇలా త‌న‌కు డ‌బుల్ హ్యాపీ ద‌క్కింద‌ని తార‌క్ ఖుషీ ఖుషీగా ఉన్నాడ‌ట‌.

Loading...

Leave a Reply

*