జ‌న‌తాకి అదే మైన‌స్‌… లేకుంటే శ్రీమంతుడు ఎగిరిపోయేది..!

ntr-janata-garage-misses-tremendous-opportunity

ఎవ‌రు ఔన‌న్నా… ఎవ‌రు కాద‌న్నా జ‌న‌తా గ్యారేజ్ భారీ విజయం సాధించింది. క‌ళ్లు చెదిరే వ‌సూళ్లు పొందింది. బాక్సాఫీస్ లెక్క‌లు చాలా చోట్ల తిర‌గ‌రాస్తోంది. యంగ్‌టైగ‌ర్ కెరీర్‌లోనే ఈ సినిమా అతి పెద్ద హిట్‌. నిన్న‌మొన్న‌టిదాకా ఆల్‌టైమ్ ఇండ‌స్ట్రీ హిట్స్‌లో ఒక్క‌టి కూడా లేని తార‌క్‌కి ఇది బిగ్ రిలీఫ్‌. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో అతిపెద్ద విజయం సాధించిన చిత్రాల‌లో ఇది మూడోది. బాహుబ‌లి, శ్రీమంతుడు.. జ‌న‌తా గ్యారేజ్‌. ఇదీ లైన్‌.

నైజాంలో దాదాపు ఈ చిత్రం 20 కోట్లకు రీచ్ అయింది. బాహుబ‌లి, శ్రీమంతుడు త‌ర్వాత దీనిదే రికార్డ్‌. ఇటు, చాలా ఏరియాస్‌లో నాన్ బాహుబ‌లి రికార్డ్‌ల‌ను పొందింది. సీడెడ్‌తోపాటు క‌ర్నాట‌క‌లోనూ సంచ‌ల‌న వ‌సూళ్లను క‌లెక్ట్ చేసింది. ఇటు, కృష్ణా, గుంటూరుతోపాటు ఉత్త‌రాంధ్ర‌లోనూ తిరుగులేని క‌లెక్ష‌న్లు సాధించింది. ఇలా మేజ‌ర్ ఏరియాస్‌లో స్ట్రాంగ్‌గా ఉన్నా… జ‌న‌తా గ్యారేజ్‌కి రెండు ఏరియాస్‌లో కాస్త వీక్ అయింది. లేకుంటే.. శ్రీమంతుడు రికార్డులు ఎప్పుడో ఎగిరిపోయేవి అని అంటున్నారు ట్రేడ్ పండితులు.

అవేంట‌నుకుంటున్నారా…? మొద‌టిది ఓవ‌ర్సీస్‌.. ఇక్క‌డ ఈ చిత్రం 18ల‌క్ష‌ల డాలర్‌ల‌ను మాత్ర‌మే పొందింది. తార‌క్ ప్రీవియ‌స్ మూవీ ఇక్క‌డ 21 ల‌క్ష‌ల డాల‌ర్‌ను సాధించింది. జ‌న‌తా కూడా అదే రేంజ్‌లో మ‌రో మిలియ‌న్ డాల‌ర్ల‌ను క‌లెక్ట్ చేసి ఉంటే.. శ్రీమంతుడు రికార్డ్‌లు తేలిపోయేవి. ఇటు, ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న మ‌ల‌యాళీ మార్కెట్‌లో్నూ ఈ సినిమా అంత‌గా ఆడ‌లేదు. మోహ‌న్‌లాల్ క్రేజ్‌తో అక్కడ మినిమ‌మ్ ఆరు కోట్ల‌యినా వ‌స్తాయ‌ని ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ, అక్క‌డ ఈ చిత్రం కేవ‌లం 3.5 కోట్ల‌కే ప‌రిమిత‌మ‌యింది. ఇది మ‌రో బ్యాడ్ ల‌క్‌. ఇలా ఈ రెండు ఏరియాస్‌లో జ‌న‌తా.. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు రాణించి ఉంటే శ్రీమంతుడు రికార్డ్‌లు ఎప్పుడో బ‌ద్ద‌ల‌య్యేవి. లేట్‌గా అయినా లేటెస్ట్‌గా తార‌క్ చ‌రిత్ర సృష్టించేవాడు.

Loading...

Leave a Reply

*