ఎన్టీఆర్‌పై బిగ్ బీ ఫ్యామిలీలో చ‌ర్చ – గ్రేట్ అన్న బిగ్ బీ

amithab-bacchan-ana-ntr

ఎన్టీఆర్ ఈజ్ గ్రేట్…. అత‌డు చాలా గొప్ప న‌టుడు.. ఈ మాట‌లు అన్న‌ది ఎవ‌రో అల్లాట‌ప్పా న‌టుడు కాదు.. ఇండియా మొత్తం గౌర‌వించే బిగ్ బీ..ఆలిండియా సూప‌ర్‌స్టార్ అమితాబ్‌బ‌చ్చ‌న్‌…. ఈ మాట‌లు అన్న‌ది పెద్ద ఎన్టీఆర్ గురించి కాదు… చిన్న ఎన్టీఆర్ గురించి… జూనియ‌ర్ గురించి బిగ్ బీ ఇలా మాట్లాడారుట‌… అమితాబ్ ఇంట్లో కుటుంబం అంతా క‌లిసి భోంచేస్తుండ‌గా ఎన్టీఆర్ ప్ర‌స్తావ‌న వ‌చ్చిందిట‌… డైనింగ్ టేబుల్ ద‌గ్గ‌ర కూర్చున్న అమితాబ్‌, ఆయ‌న భార్య జ‌య‌బాధురి, కొడుకు అభిషేక్‌, కోడ‌లు ఐశ్వ‌ర్య… ఈ న‌లుగురు క‌లిసి జూనియ‌ర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుకున్నారుట‌… తార‌క్ న‌ట‌న‌లో ఇర‌గ‌దీసేస్తాడ‌ని కేవ‌లం అమితాబ్‌బ‌చ్చ‌నే కాదు.. ఆయ‌న కుటుంబం మొత్తం మెచ్చుకుందిట‌…

జూనియ‌ర్ ఎన్టీఆర్ చేసిన‌ట్టు అభిషేక్ చేయ‌లేడ‌ని స్వ‌యంగా అమితాబ్ కామెంట్ చేశారుట‌…అమితాబ్ బ‌చ్చ‌న్ ఏంటి… మ‌న జూనియ‌ర్ ఎన్టీఆర్‌ని పొగ‌డ‌డం ఏంటి అని న‌మ్మ‌లేక‌పోతున్నారా… ఇది నిజంగా నిజం… ఏ సంద‌ర్భంగా బిగ్‌బీ ఈ వ్యాఖ్య‌లు చేశారు అని ప్ర‌శ్నిస్తారా… దీనికి కూడా ఓ సంద‌ర్భం ఉందిట‌….తెలుగులో జూనియ‌ర్‌తో టెంప‌ర్ చేసి హిట్ సాధించాడు పూరీ జ‌గ‌న్నాథ్‌… ఈ సినిమాను హిందీలో అభిషేక్‌తో చేయాల‌ని భావించిన పూరీ… సీడీని తీసుకువెళ్లి అభిషేక్‌కి చూపించాట్ట‌…. అయితే సినిమా మొత్తం చూసిన అభిషేక్ తాను జూనియ‌ర్ లాగా యాక్ట్ చేయలేన‌ని, అంత ఎనర్జీ త‌న‌కు లేద‌ని తేల్చిచెప్పేశాట్ట‌….

ఆ త‌ర్వాత ఈ సినిమా చూసిన అమితాబ్ కూడా జూనియ‌ర్ న‌ట‌న‌ను ఎంతో ప్ర‌శంసించారుట‌…. జూనియ‌ర్ ఎంతో ఎత్తు ఎదుగుతాడ‌ని ఆశీర్వ‌దించారుట బిగ్ బీ… ఈ టెంప‌ర్ సినిమా గురించి, జూనియ‌ర్ ఎన్టీఆర్ యాక్ష‌న్ గురించి బిగ్‌బీ ఫ్యామిలీ ఇలా మాట్లాడుకున్నారుట‌… అంతేకాదు జూనియ‌ర్ ఎన్టీఆర్ గ్రేట్ అని అమితాబ్ ప్ర‌శంసించారుట‌… జూనియ‌ర్ జీవితానికి ఈ పొగ‌డ్త‌లు చాలు… అమితాబ్ అంత‌టివాడు మెచ్చుకున్నాక ఇక ప్ర‌పంచ‌మంతా ప‌ట్టించుకోక‌పోయినా ఫ‌ర‌వాలేదు. ఎవ‌రేమ‌న్నా లెక్క చేయాల్సిన ప‌ని లేదు.

Loading...

Leave a Reply

*