ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాపై భయంకరమైన ప్రచారం…

untitled-20

జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ సైలెంట్ అయిపోయాడు. మరే సినిమా ఎనౌన్స్ చేయలేదు. దీనికి కారణం ఫ్లాప్ వస్తుందేమో అనే భయం. జనతా గ్యారేజ్ రేంజ్ లో నెక్ట్ సినిమా ఆడదేమో అనే టెన్షన్. అందుకే దర్శకుల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాడు తారక్. అయితే ఎంతమంది దర్శకుల పేర్లు తెరపైకి వస్తున్నా.. అన్నీ ప్రచారంగానే మిగిలిపోతున్నాయి. మొన్నటివరకు దర్శకుల పేర్లు తెరపైకి వస్తే ఇప్పుడు ఏకంగా కథలు ప్రచారంలోకి వస్తున్నాయి.

తన నెక్ట్స్ సినిమాగా తారక్ ఓ అంధుడి పాత్రను చేయబోతున్నాడట. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందట. కథ నచ్చడంతో వెంటనే డెవలప్ చేయమని తారక్ చెప్పడంతో అనిల్ రావిపూడి వారం రోజులు కూర్చొని సగం స్క్రీన్ ప్లే పూర్తిచేశాడట. ఇదే కథలో నటించబోతున్నట్టు గతంలో హీరో రామ్ ప్రకటించాడు. అయితే ఇప్పుడీ కథలో తారక్ నటిస్తాడనే ప్రచారం జరుగుతోంది.

మరోవైపు అంధుడిగా కాకుండా బాక్సర్ గా తారక్ కనిపించబోతున్నాడనే ప్రచారం కూడా నడుస్తోంది. పూరి జగన్నాధ్ ఈ కథను రాశాడని.. ఇదే కథను తారక్ కు వినిపించాడనే రూమర్ వినిపిస్తోంది. ఈ స్టోరీలైన్ కూడా ఎన్టీఆర్ కు బాగా నచ్చిందట. తన నెక్ట్స్ సినిమాకు అంధుడిగా కనిపించాలా.. బాక్సర్ గా కనిపించాలా అనే డైలమాలో ఉన్నాడట యంగ్ టైగర్.

Loading...

Leave a Reply

*