ఒక్కొక్కటి నరుక్కొస్తున్న ఎన్టీఆర్

ntr2

ఎన్టీఆర్ ఆనందానికి ఇప్పుడు హద్దుల్లేవ్. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న బ్లాక్ బస్టర్ విజయాన్ని జనతా గ్యారేజ్ తో అందుకున్నాడు తారక్. ఇకపై అతడు నయా ప్లాన్స్ రచిస్తున్నాడు. తన మార్కెట్ ను ఎక్స్ పాండ్ చేసుకునే పనిలో పడ్డాడు. ఇన్నాళ్లూ తారక్ లోకల్ హీరో మాత్రమే. ఇకపై సౌత్ లోనే బిగ్ స్టార్ అనిపించుకోవాలని తారక్ తహతహలాడుతున్నాడు.మొన్నటివరకు ఓవర్సీస్ మార్కెట్ పై దృష్టిపెట్టాడు. తోటి హీరోలంతా మిలియన్ మార్క్ అందుకుంటుంటే తను మాత్రం వెనక పడ్డానని బాధపడ్డాడు. కానీ నాన్నకు ప్రేమతో ఆ లోటు తీరిపోయింది. ఓవర్సీస్ లో బ్యాంకబుల్ హీరో అనిపించుకున్నాడు.

ఇక తెలుగులో ఎప్పుడూ రేసులో ఉండేవాడు తప్పిస్తే లీడ్ మాత్రం అనిపించుకోలేకపోయాడు. తాజాగా వచ్చిన జనతా గ్యారేజ్ తో ఆ లోటు కూడా తీరింది. ఇండస్ట్రీ ఆల్ టైం హిట్స్ లో మూడో స్థానం దక్కించుకున్నాడు.ఓవర్సీస్, లోకల్ లో సత్తాచాటిన ఎన్టీఆర్ ఇప్పుడు పొరుగు మార్కెట్లపై కన్నేశాడు. కుదిరితే కేరళ, తమిళనాడు మార్కెట్లలో పట్టుకోసం ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే తమిళనాట మహేష్ బాబుకు కాస్తోకూస్తో పట్టుంది. అటు కేరళలో బన్నీ చాలా స్ట్రాంగ్. ఈ రెండు మార్కెట్లలోకి తారక్ కూడా ప్రవేశించాలనుకుంటున్నాడు. నెక్ట్స్ సినిమా చేస్తే తెలుగు-తమిళ భాషల్లో ప్లాన్ చేయాలని అనుకుంటున్నాడు.

Loading...

Leave a Reply

*