సినిమా చేస్తాడట… ఎప్పుడనేది చెప్పడట…

jr-ntr

లెక్కప్రకారం… జనతా గ్యారేజ్ తర్వాత తారక్ ఇప్పటికే ఓ సినిమా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే.. వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమాకు తారక్ ఓకే చెప్పాడు. అతడ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ… కల్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సినిమా ఉంటుందనే అంతా అనుకున్నారు. ఈ మేరకు తారక్ బర్త్ డే సందర్భంగా ప్రెస్ నోట్ కూడా బయటకు వచ్చింది. కానీ జనతా గ్యారేజ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. తారక్ ప్లాన్స్ మారిపోయాడు.

వక్కంతను దర్శకుడిగా పరిచయం చేసి, ప్రయోగాలు చేసే కంటే మరో స్టార్ డైరక్టర్ తో పనిచేయడానికి తారక్ మొగ్గుచూపుతున్నాడట. అయితే వక్కంతంను మాత్రం పక్కనపెట్టలేదని తెలుస్తోంది. కచ్చితంగా వక్కంతంతో సినిమా చేస్తానని, కాకపోతే… జనతా గ్యారేజ్ లాంటి బిగ్గెస్ట్ సక్సెస్ తర్వాత వక్కంతంతో సినిమా చేయడం కరెక్ట్ కాదని తారక్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.మరోవైపు మెగా కాంపౌండ్ నుంచి కూడా వక్కంతం కు పాజిటివ్ సిగ్నల్స్ రావడం లేదు. బన్నీతో సినిమా చేస్తాడంటూ ఆమధ్య వార్తలు వచ్చినప్పటికీ…

బన్నీ ఏకంగా ఇప్పుడు ఒకటి కాదు.. రెండు సినిమాలు ప్రకటించాడు. హరీష్ శంకర్ సినిమాను ఇప్పటికే సెట్స్ పైకి తీసుకొచ్చిన అల్లు అర్జున్… ఆ వెంటనే లింగుస్వామి సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు. సో… మెగా కాంపౌండ్ లో వక్కంతంకు ఇప్పటికిప్పుడు ఛాన్స్ లేనట్టే.సో… ప్రస్తుతానికైతే వక్కంతం ఎన్టీఆర్ దగ్గర ఉండాల్సిందే. తారక్ ఎప్పుడంటే అప్పుడు సినిమా చేయాల్సిందే. కావాలంటే ఈ గ్యాప్ లో కొత్త కథలు రాసుకోవడం మంచిది.

Loading...

Leave a Reply

*