మా టీవీపై విరుచుకుప‌డుతున్న‌ జూనియ‌ర్ అభిమానులు

tarak

జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు తెలుగులోని ఓ ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ చానెల్‌పై విరుచుకుప‌డుతున్నారు…. ఆ చానెల్‌పై వాళ్లు చెల‌రేగిపోతున్నారు… ఆ చానెల్ మ‌రేదో కాదు.. మా టీవీ… మా టీవీని…మీ, మా, మ‌న టీవీ అనుకోవాల్సిన ఎన్టీఆర్ అభిమానులు ఆ చానెల్‌పై ఎందుకు విరుచుకుప‌డుతున్నారో తెలుసుకోవాలంటే కొంచెం ఫ్లాష్‌బ్యాక్ తెలుసుకోవాలి…. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోపంలో న్యాయం ఉంటే చానెల్ వాద‌న‌లో కూడా న్యాయం ఉంది… ప్ర‌ముఖ మా టీవీ చానెల్ పేరు చెబితే చాలు జూనియ‌ర్ అభిమానులు ఇప్పుడు పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఆగ్ర‌హంతో ఊగిపోతున్నారు…ఆ చానెల్‌కు వ్య‌తిరేకంగా తార‌క్ అభిమానులు నాటు ఘాటు హాటు కామెంట్ల‌తో కాక పుట్టిస్తున్నారు… మా టీవీకి వ్యతిరేకంగా సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు గుప్పిస్తూ జూనియ‌ర్ అభిమానులు చెల‌రేగిపోతున్నారు..

అస‌లు విష‌యం ఏంటంటే ఎన్టీఆర్ న‌టించిన జ‌నతా గ్యారేజ్ సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయింది.. ఇండ‌స్ట్రీ హిట్ అందుకుంది… టాలీవుడ్‌లో ఆల్‌టైమ్ టాప్ 3 సినిమాల్లో స్థానం ద‌క్కించుకుంది…ఈ నెల 20వ తేదీకి ఆ సినిమా 50 రోజులు పూర్తిచేసుకుంటుంది… ఈ సినిమాను కొన్ని ముఖ్య‌మైన సెంట‌ర్ల‌లో వంద రోజులు ఆడించ‌డానికి జూనియ‌ర్ వీరాభిమానులు ఇప్ప‌టినుంచే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు… అయితే వారి ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లేలా దీపావళి సంద‌ర్భంగా ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని త‌మ చానెల్‌లో టెలికాస్ట్ చేయ‌నున్న‌ట్టు మా టీవీ ప్ర‌క‌టించింది… దీంతో జూనియ‌ర్ అభిమానులు భ‌గ్గుమంటున్నారు… ఈ సినిమాను మా టీవీలో చూపిస్తే ఇక థియేట‌ర్ల‌కు వ‌చ్చి సినిమా ఎవ‌రు చూస్తారు అని తార‌క్ అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు.. ఈ సినిమాను టెలికాస్ట్ చేయ‌వ‌ద్ద‌ని మా టీవీని కోరుతున్నారు….

అయితే డ‌బ్బుల‌కు ఆశ‌ప‌డ్డ సినిమా నిర్మాత శాటిలైట్ హ‌క్కుల‌ను భారీ రేట్ల‌కు అమ్మేసుకున్నాడు.. అగ్రిమెంట్‌లోనే సినిమాను ఎప్పుడు టెలికాస్ట్ చేయాలో స‌ద‌రు చానెల్‌కు నిర్మాత చెబుతాడు.. భారీగా డ‌బ్బిచ్చి కొనుక్కున్న జ‌న‌తా గ్యారేజ్‌ను ఇప్పుడు ఆ ప్ర‌కార‌మే మా టీవీ టెలికాస్ట్ చేయ‌నుంది… మీకు కోపం ఉంటే శాటిలైట్ రైట్స్ అమ్మేసిన నిర్మాత‌ను ప్ర‌శ్నించండి… మ‌మ్మ‌ల్ని కాదు అంటూ జూనియ‌ర్ ఫ్యాన్స్‌కి ఘాటుగా స‌మాధానం చెబుతోంది మా టీవీ…. సో జూనియ‌ర్ ఫ్యాన్స్ మా టీవీ మీద కోప్ప‌డేకంటే నిర్మాత‌ను నిల‌దీస్తే మంచిద‌ని సినీ పండితులు చెబుతున్నారు.

Loading...

Leave a Reply

*