పూరీతో పెట్టుకొని ఎన్టీఆర్ తప్పుచేశాడా…?

untitled-6

త్వరలోనే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఎన్టీఆర్ రెడీ అవుతున్నాడు. నేరుగా చెప్పకపోయినా ఇది దాదాపు పక్కా న్యూస్. ఎందుకంటే… మిగతా దర్శకులంతా తప్పుకోవడంతో ఇప్పుడు ఎన్టీఆర్ వద్ద పూరి ఆప్షన్ ఒక్కటే మిగిలింది. సో.. ఎన్టీఆర్-పూరి కాంబినేషన్ లో టెంపర్ తర్వాత మరోమూవీ రానుందనే న్యూస్ కు దాదాపు ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. అయితే పూరీతో పెట్టుకొని ఎన్టీఆర్ మరోసారి తప్పుచేస్తున్నాడనే సెక్షన్ కూడా ఉంది.

నాన్నకు ప్రేమతో సినిమా నుంచి కొత్తదనం ప్రయత్నిస్తున్నాడు తారక్. తన లుక్స్, మేనరిజమ్స్ అన్నీ మార్చుకున్నాడు. ప్రతి సినిమాకు ఎంతో ఎదుగుతున్నాడు. మరోవైపు పూరీ జగన్నాధ్ సినిమాల్లో హీరో ఒకేలా ఉంటాడు. పోకిరి, ఏక్ నిరంజన్ సినిమాల నుంచి పూరి హీరోల మేనరిజమ్స్ చూస్తూనే ఉన్నాం. సో.. ఎన్టీఆర్ మరోసారి మొనాటనీ ట్రాక్ మీదకు వచ్చేస్తున్నాడని ఓ సెక్షన్ వాదిస్తోంది.

అయితే మరో వర్గం మాత్రం అలా జరగదంటోంది. పూరీ ఇప్పటికే తారక్ కు ఓ మంచి కథ చెప్పాడని, ఈసారి వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఓ కుటుంబ కథాచిత్రం రాబోతుందని వాళ్లు అంటున్నారు. సో.. కథతో పాటు తారక్ క్యారెక్టరైజేషన్ కూడా కొత్తగా ఉంటుందని వాదిస్తున్నారు. మరి ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది త్వరలోే తేలిపోతుంది.

Loading...

Leave a Reply

*