షాకింగ్…వినాయక్ డైరక్షన్ లో తారక్…

vinayak

నిజంగా ఇది షాకింగ్ న్యూసే. ఎన్టీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని నిజంగా ఎవరూ ఊహించి ఉండరు. కానీ అన్నీ అనుకున్నట్టు జరిగితే జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ చేయబోయేది అదుర్స్-2 మాత్రమే. దీనికి సంబంధించి ఇప్పటికే తెరవెనక చర్చలు, సంప్రదింపులు సాగుతున్నాయి. ఎన్టీఆర్ కూడా వీటిలో చాలా చురుగ్గా పాలుపంచుకుంటున్నాడు.

జనతా గ్యారేజ్ తర్వాత చాలామంది దర్శకుల పేర్లు రౌండ్లు కొట్టాయి. కానీ వినాయక్ పేరు మాత్రం ఎప్పుడూ తెరపైకి రాలేదు. అయితే అప్పట్లో రౌండ్స్ తిరిగిన దర్శకులంతా సైడైపోయారు. దీంతో సడెన్ గా వినాయక్ తెరపైకి వచ్చాడు. ప్రస్తుతం చిరంజీవి రీఎఁట్రీ మూవీని డైరక్ట్ చేస్తున్న వినాయక్… మరో నెల రోజుల్లో ఆ సినిమా పని పూర్తిచేయబోతున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి సెట్స్ పైకి వెళ్తాడనే టాక్ వినిపిస్తోంది.

వినాయక్ అంటే తారక్ కు చాలా ఇష్టం. కెరీర్ స్టార్టింగ్ లోనే ఆది లాంటి తిరుగులేని విజయంతో తారక్ ను ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టాడు వినాయక్. అందుకే వినాయక్ అంటే ఎన్టీఆర్ కు చాలా అభిమానం. అదుర్స్-2 సినిమాతో తనకు అలాంటిదే మరో మేకోవర్ ఇమేజ్ ఇస్తాడని ఎన్టీఆర్ గట్టిగా ఫీల్ అవుతన్నాడట. పైగా జనతా గ్యారేజ్ లాంటి ఔట్ అండ్ ఔట్ సీరియస్ మూవీ తర్వాత… అదుర్స్-2 లాంటి కామెడీ సబ్జెక్ట్ చేస్తే చాలా బాగుంటుందని కూడా ఫీల్ అవుతున్నాడట.

Loading...

Leave a Reply

*