ఎన్టీఆర్ ఎంట్రీ ఇక లేనట్టే…

ntr

జనతా గ్యారేజ్ రిలీజైన కొత్తలో ఎన్టీఆర్ పై ఓ పెద్ద పుకారు హల్ చల్ చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఇజమ్ సినిమాలో తారక్ కూడా ఓ గెస్ట్ రోల్ చేస్తున్నాంటూ ఓ రేంజ్ లో ప్రచారం జరిగింది. తర్వాత ఆ ప్రచారంపై ఎవరూ పెద్దగా స్పందించలేదు. అంతా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మరోసారి ఆ పుకారు తెరపైకి వచ్చింది. కానీ ఈసారి మాత్రం దానిపై క్రిస్టల్ క్లారిటీ కూడా వచ్చేసింది.అవును… కల్యాణ్ రామ్ సినిమాలో ఎన్టీఆర్ నటించడం లేదు. ఇన్నాళ్లకు ఈ అంశంపై క్లారిటీ వచ్చింది. సినిమా అప్ డేట్స్ ను వివరించిన దర్శకుడు పూరి జగన్నాధ్.. సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయిందని…

మరో వారం, పది రోజుల్లో ఫస్ట్ కాపీ సిద్ధం చేస్తామని అంటున్నాడు. సినిమాను అక్టోబర్ 2 లేదా 3వ వారంలో విడుదల చేస్తామంటున్నాడు. అంటే దీనర్థం సినిమాకు గుమ్మడికాయ కొట్టబోతున్నారనే. సో… ఇజమ్ సినిమాలో తారక్ లేనట్టే.నిన్నంతా పుట్టినరోజు వేడుకలతో బిజీగా ఉన్నాడు పూరి జగన్నాధ్. ఈ సందర్భంగా నెక్ట్స్ సినిమా గురించి సన్నిహితుల దగ్గర చర్చించాడు. ఇటీవలే బ్యాంకాక్ వెళ్లాడు జగన్. ఎందుకంటూ కొందరు ప్రశ్నించగా… ఎన్టీఆర్ సినిమాకు స్క్రీన్ ప్లే రాసేందుకే వెళ్లానంటూ క్లారిటీ ఇచ్చాడు తారక్. అయితే ఆ స్క్రీన్ ప్లేను ఇంకా తారక్ కు వినిపించలేదట. దసరా సెలవుల టైమ్ లో ఎన్టీఆర్ కు పూర్తి కథను వినిపిస్తాడట.

Loading...

Leave a Reply

*