అరుదైన ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన తార‌క్‌.. !

untitled-9

గ‌త ప‌ది, ప‌న్నెండేళ్లుగా తార‌క్ మార్కెట్ బాగా ప‌డిపోయింద‌ని, ఆయ‌న స్థాయి స‌క్సెస్ రాలేద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మ‌హేష్ కంటే ముందే భారీ హిట్‌లు డెలివ‌ర్ చేసి.. ఆల్‌మోస్ట్ నెంబ‌ర్ వ‌న్ స్థాయికి ఎదిగిన తార‌క్‌.. ఆ త‌ర్వాత డ‌ల్ అయ్యాడు. ఇటీవ‌ల ఆయ‌న‌కు స‌రైన స‌క్సెస్ లేదు. దీంతో, ఆయ‌న స్టామినాపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. వాటికి ఈ ఏడాది చెక్ చెప్పాడు తార‌క్. అంతేకాదు, 2016లో యంగ్‌టైగ‌ర్ ఓ అరుదైన రికార్డ్ కూడా క్రియేట్ చేశాడు.

జూనియర్ ఎన్టీఆర్‌కి 2016 గోల్డెన్ ఇయర్. ఇన్నేళ్లు హిట్ కోసం త‌పించిన తార‌క్‌.. ఒకే ఏడాది రెండు హిట్స్ కొట్టేసి నిజంగా టైగర్ అనిపించుకున్నాడు. బాక్సాఫీస్ కలెక్షన్స్ లో ఇంతకు ముందు ఎన్నడూ ఏ టాలీవుడ్ హీరోకూ దక్కని రికార్డు ఎన్ టిఆర్ కు దక్కబోతోంది.

ఇంతకూ జూనియర్ నెలకొల్పే ఆ రికార్డ్ ఏంటంటే…అతను ఈ ఏడాది 200 కోట్ల రూపాయల కలెక్షన్ రికార్డును క్రియేట్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ నటించిన రెండు సినిమాలు… నాన్నకు ప్రేమతో…, జనతాగ్యారేజ్ ఈ ఏడాది రిలీజయ్యాయి. మొదటిది సెంటిమెంట్ మూవీ అయితే… రెండోది మెసేజ్ మూవీ. నాన్నకు ప్రేమతో… సినిమా వరల్డ్ వైడ్ గా 90 కోట్లు కలెక్ట్ చేసింది.

యంగ్ టైగర్ నటించిన జనతా గ్యారేజ్ ఇప్పటికే 135 కోట్ల గ్రాస్ చేసింద‌నే టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది రిలీజైన జూనియర్ ఎన్టీఆర్ రెండు సినిమాలు కలిపి 200 కోట్ల కలెక్షన్ రికార్డును అందుకున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకే ఏడాది ఇంత భారీ కలెక్షన్స్ మరే టాలీవుడ్ హీరోకూ రాలేదనే చెప్పాలి. ఇది పరిశ్రమకు గర్వకారణమే కాక…ఎన్టీఆర్ సినిమాల వల్ల ఇండస్ట్రీలో ఎందరో కార్మికుల కుటుంబాలకు ఆసరా ఇచ్చినట్టు కూడా అవుతుంది. ఇక జూనియర్ నటించిన జనతా గ్యారేజ్ చిత్రం అక్టోబర్ 23న బుల్లితెరపై సందడి చేయనుండడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా టీఆర్ పీ రేటింగ్ ని బద్దలు కొట్టడం ఖాయమని చెబుతున్నారు.

 

Loading...

Leave a Reply

*