మ‌రో రికార్డ్‌.. స‌ల్మాన్‌, ర‌జ‌నీ కాంత్ త‌ర్వాత ఎన్టీఆరే..!

ntr

జ‌న‌తా రికార్డుల ప్ర‌భంజ‌నం క్రియేట్ చేస్తూనే ఉంది. ఇప్ప‌టికే టాలీవుడ్‌లో ఆల్‌టైమ్ థ‌ర్డ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన యంగ్‌టైగ‌ర్ లేటెస్ట్ మూవీ.. తాజాగా మ‌రో సంచ‌ల‌నం సృష్టించింది. ఆల్ ఓవ‌ర్ ఇండియాలోనే స‌ల్మాన్‌, రజనీకాంత్ త‌ర్వాత ఆ మార్క్‌ను అందుకున్న మూడో హీరోగా ఎన్టీఆర్ వండ‌ర్ క్రియేట్ చేశాడు.ఈ ఏడాది ఇండియా వైడ్ రిలీజ్ అయిన సినిమాల‌లో అతి పెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసిన చిత్రం.. స‌ల్మాన్ ఖాన్‌.. సుల్తాన్. ఓ అథ్లెట్ బ‌యోపిక్ ఆధారంగా తెర‌కెక్కిన సుల్తాన్‌.. 225కోట్ల షేర్ సాధించింది. ఇది ఒక్క ఇండియాలోనే. వ‌ర‌ల్డ్ వైడ్‌గా మరో 100 కోట్లు పొందింది.

ఇదే ఇయ‌ర్‌లో ర‌జ‌నీకాంత్ డెలివ‌ర్ చేసిన కబాలి మూవీ.. ప్ర‌పంచ వ్యాప్తంగా 175 కోట్ల షేర్ పొందింది. 2016లో ఇండియాలో విడుద‌ల‌యిన సినిమాల‌లో 80 కోట్ల మార్క్‌ను దాటిన సినిమాలు ఇవే. తాజాగా వీటి స‌ర‌స‌న చేరింది ఎన్టీఆర్ న‌టించిన జ‌న‌తా గ్యారేజ్‌. తార‌క్ సినిమాకి ముందు త‌మిళ్ హీరో విజ‌య్ తేరి 78కోట్లు షేర్ సాధించింది. అయితే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జ‌న‌తా.. ఆ మార్క్‌ను బీట్ చేసి 80 కోట్ల బౌండ‌రీని ట‌చ్ చేసింది.జ‌న‌తా గ్యారేజ్ విడుద‌లై మూడు వారాలు. ఈ మూడు వారాల‌లో ఈ చిత్రం 80 కోట్ల షేర్‌ను పొందింది.

ఇలా, ఈ ఏడాది 80కోట్ల షేర్‌ని సాధించిన సినిమాల‌లో తార‌క్ జ‌న‌తాది మూడో స్థాన‌మట‌. దీంతో, గ‌త కొన్నాళ్లుగా యంగ్‌టైగ‌ర్‌కి రికార్డులు లేవ‌నే కామెంట్స్‌ను ఒక్క సినిమాతో బ‌ద్దలుకొట్టాడు. జ‌న‌తా గ్యారేజ్ ఇటీవ‌ల అత్తారింటికి దారేది సినిమాని క్రాస్ చేసి 80 కోట్ల క్ల‌బ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అయితే, టాలీవుడ్‌లో సెకండ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన శ్రీమంతుడుకి చేరువ‌గా వచ్చింది జ‌న‌తా గ్యారేజ్‌. మ‌రి, దానిని కూడా బ‌ద్దలు కొడుతుందా? దాని బోర్డ‌ర్ దాకా వ‌చ్చి ఆగిపోతుందా? అనేది చూడాలి.

Loading...

Leave a Reply

*