ఆ టెన్ష‌న్‌తో మ‌ళ్లీ లావు అవుతున్న ఎన్టీఆర్‌

ntr

నంద‌మూరి చిన్నోడు తారక్ ఇప్పుడు జ‌న‌తా గ్యారేజ్ స‌క్సెస్‌తో జోరు మీదున్నాడు… టాలీవుడ్‌లో త‌న సినిమా ఆల్‌టైమ్ టాప్ 3 హిట్స్‌లో ఒకటిగా నిలిచినందుకు జూనియ‌ర్ ఎన్టీఆర్ తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నాడు….. అయితే జ‌న‌తా గ్యారేజ్ సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయిన ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్న ఎన్టీఆర్ ఇప్పుడు మ‌ళ్లీ గాలికొట్టిన బెలూన్‌లా ఊరిపోతున్నాడు.. మ‌ళ్లీ లావుగా మారిపోతున్నాడు… పాత ఎన్టీఆర్‌ని గుర్తుకుతెస్తున్నాడు… కొద్ది రోజుల క్రితం క‌ల్యాణ్‌రామ్ ఇజం ఆడియో ఫంక్ష‌న్‌కి వ‌చ్చిన ఎన్టీఆర్‌లో ఈ మార్పు స్ప‌ష్టంగా కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించింది…. ఒక‌ప్పుడు లావుగా ఉండి ఆ త‌ర్వాత స‌న్న‌గా క‌రెంటు తీగ‌లా మారిన తార‌క్ ఇప్పుడు మ‌ళ్లీ లావైపోయాడు.. ఇజం ఆడియో ఫంక్ష‌న్‌లో ఎన్టీఆర్‌ని చూసిన‌వాళ్లంతా ఇదే చ‌ర్చించుకున్నారు….

యంగ్ టైగ‌ర్ మ‌ళ్లీ లావుగా క‌నిపిస్తున్నాడేంటా అని అభిమానులు తెగ ఆందోళ‌న చెందారు… ఎన్టీఆర్ ఇంత లావుగా ఉండడం చూసి అభిమానులు షాక్ అయ్యారు.. జ‌న‌తా గ్యారేజ్ సినిమా త‌ర్వాత మ‌రో సినిమా అనౌన్స్ చేయ‌ని జూనియ‌ర్ తిని ఇంట్లో కూర్చోవ‌డంతో ఇలా లావ‌య్యాడ‌ని చాలామంది అనుకున్నారు… అయితే ఎన్టీఆర్ ల‌డ్డూలా అవ‌డానికి కార‌ణం అదికాద‌ట‌… ఓ టెన్ష‌న్‌తో ఎన్టీఆర్ తెగ ఇద‌యిపోతున్నాట్ట‌…. ఆ టెన్ష‌న్‌తో ఏం తింటున్నాడో ఎంత తింటున్నాడో అర్థం కాకుండా తిని ఎన్టీఆర్ లావు అయిపోయాట్ట‌… అస‌లు సంగ‌తి ఏంటంటే జ‌న‌తా గ్యారేజ్ సూప‌ర్‌డూప‌ర్ హిట్ త‌ర్వాత ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాపై అంచ‌నాలు అత్యంత భారీగా పెరిగిపోయాయి…. దీంతో ఎన్టీఆర్‌కి ఏ ద‌ర్శ‌కుడు చెప్పిన కథ‌ న‌చ్చ‌ట్లేదు… మంచి స్టోరీ దొర‌క్క‌పోగా డైరెక్ట‌ర్‌గా ఎవ‌రిని పెట్టుకోవాలా అని తెగ ఇదైపోతున్నాడు ఎన్టీఆర్‌… ఇలా నెక్ట్స్ సినిమా టెన్ష‌న్‌తో ఎన్టీఆర్ కొద్దిగా లావెక్కాడ‌ని స‌మాచారం.

Loading...

Leave a Reply

*