బాల‌య్య‌, ఎన్టీఆర్ సినిమాకి క‌థ కుదిరింది.. స్టోరీ ఏంటంటే..?

jr-ntr

నంద‌మూరి బాబాయ్‌, అబ్బాయ్‌లు ఏక‌మ‌వుతున్నారట‌. త్వ‌ర‌లోనే వీళ్లిద్ద‌రి మ‌ధ్య పాత బంధం మ‌రోసారి చిగురించ‌నుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ఏడాది ముగిసేలోపే బాబాయ్‌, అబ్బాయ్ ఒకే వేదిక‌పై ప్ర‌త్య‌క్షం కానున్నార‌నే వార్త షికారు చేస్తోంది. ఆ బంధం మ‌రింత బ‌ల‌పడాలంటే ముందు బాల‌య్య, తార‌క్ క‌లిసి ఒకే సినిమాలో న‌టించాల‌ని భావిస్తున్నార‌ట‌. ఈ సినిమా క‌థ కూడా ఇప్ప‌టికే ఫిక్స్ అయింద‌ని, త్వ‌ర‌లోనే ఫైన‌ల్ వెర్ష‌న్‌కి బాబాయ్‌, అబ్బాయ్ ఓకే చెయ్య‌నున్నార‌నే టాక్ న‌డుస్తోంది.

ఈ సినిమా స్టోరీ లైన్ వింటేనే అదిరిపోతాం. అది మ‌రేదో కాటద‌ట‌.. ఓ బ‌యోపిక్‌లో న‌టించ‌నున్నార‌ట వీళ్లిద్ద‌రూ. దివంగ‌త మాజీ సీఎం, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత గాధ‌లో నటించ‌నున్నార‌ట. ఎన్టీఆర్ కెరీర్‌లోని యంగ్ ఏజ్ రోల్‌కి తార‌క్‌ని అనుకుంటున్నారు. ఇటు, ఏజ్డ్ పాత్ర‌తోపాటు సినిమాల‌కి గుడ్ బై చెప్పి, రాజ‌కీయాల‌లోకి వ‌చ్చిన త‌ర్వాత రోల్‌ని బాల‌య్య పోషిస్తాడ‌ట‌. ఈ వార్త‌లో నిజ‌మెంత అనేది తెలియ‌దు కానీ.. ఇదే క‌నుక నిజ‌మ‌యితే నంద‌మూరి హీరోల‌తో పాటు టీడీపీ శ్రేణులు కూడా ఒక్కతాటిపైకి వ‌స్తాయి.

ఇదంతా చంద్ర‌బాబు పొలిటికల్ స్టంట్, ప‌వ‌న్ టీడీపీకి వ్య‌తిరేకంగా మాట్లాడుతుండ‌డంతో తార‌క్‌ని తెరపైకి తెస్తున్నార‌ని చెబుతున్నారు కొంద‌రు. మ‌రి, ఏది వాస్త‌వ‌మో అనేది త్వ‌ర‌లోనే తేల‌నుంది.

Loading...

Leave a Reply

*