ఒక్క సినిమా లేదు.. ఆదాయం మాత్రం ఫుల్‌.. ఎలా..?

untitled-6-copy

కేవలం ఫుల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తులకు మాత్రమే ఇలా జరుగుతుంది. అఖిల్ అరంగేట్రానికి ముందే ఆదాయం తెచ్చుకున్నాడు. తనకంటూ కొన్ని బ్రాండ్స్ క్రియేట్ చేసుకున్నాడు. ఎఁదుకంటే ఫుల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి. కానీ ఇక్కడ ఈ అమ్మడిని చూడండి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. ఓన్లీ ఫ్రంట్ గ్రౌండ్ మాత్రమే ఉంది. అదేనండి.. ఎట్రాక్ట్ చేసే అందం మాత్రమే ఉంది. కేవలం దాన్నే పెట్టుబడిగా పెట్టుకొని, ఒక్క సినిమా సినిమా ఛాన్స్ లేకపోయినా, ఆదాయం మాత్రం దండిగా ఆర్జిస్తోంది.

ఇక్కడ మీరు తప్పుగా మాత్రం అర్థం చేసుకోకండి. ఈమె పేరు సోనీ చరిష్టా. ఈమె సంపాదన అంతా సక్రమమే. కాకపోతే సినిమాల ద్వారా వచ్చింది కాదు. ఇంకా చెప్పాలంటే సినిమాల్లో ఎంట్రీ ఇంకా జరగలేదు. కానీ సోనీ చరిష్టా సోషల్ మీడియాలో చాలా పాపులర్. ఎందుకంటే.. తన సొంత ఖర్చుతో కనీసం నెలకు ఒకసారైనా ఓ లావిష్ ఫొటోషూట్ ఒకటి రిలీజ్ చేస్తుంది. కామన్ గా అవి హాట్ గా ఉంటాయి కాబట్టి.. అన్ని వెబ్ సైట్స్ లో ప్రత్యక్షం అవుతాయి.

అలా తన హాట్ ఫొటోషూట్లతో క్రేజ్ తెచ్చుకుంటోంది సోనీ. రిబ్బన్ కటింగ్ లు, పేజ్ త్రీ పార్టీలు, స్పెషల్ గెస్ట్ గా హాజరవ్వడాలు లాంటి కార్యక్రమాల ద్వారా బాగానే సంపాదిస్తోంది. అయితే ఆమె ఫొటోషూట్లు రిలీజ్ చేస్తున్న పర్పస్ మాత్రం వేరు. సినిమాల్లో కనిపించాలనేది ఆమె కోరిక. ఆ హీరోయిన్ కల ఎప్పటికి తీరుతుందో చూడాలి.

Loading...

Leave a Reply

*