మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన నితిన్

untitled-10

నితిన్ హీరోగా ఇప్పుడు మంచి స్వింగ్ మీదున్నాడు. అటు నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. సో.. ఇలాంటప్పుడే కాస్త ఇల్లు చక్కదిద్దుకోవాలి. సెటిల్ అయిపోవాలి. ప్రస్తుతం ఈ హీరో అదే పనిలో ఉన్నాడు. సినిమా ఫీల్డ్ లో కొనసాగుతూనే, బయట బిజినెస్ లపై ఓ కన్నేసి ఉంచాడు. ఇందులో భాగంగా చాలా వ్యాపారాల్ని గమనించిన నితిన్.. ఫైనల్ గా రెస్టారెంట్ బిజినెస్ లోకి దిగాలని నిర్ణయించుకున్నాడట.

ఇప్పటికే టి-గ్రిల్ పేరిట నితిన్ ఓ రెస్టారెంట్ ను నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి పూర్తిగా తనే ఓనర్ గా ఉండకుండా… కో-ఓనర్ గా స్టయిలిస్ట్ నీరజ కోనను కూడా తీసుకున్నాడట. వీళ్లిద్దరూ కలిసి డబ్బులు పెట్టి టి-గ్రిల్ అనే రెస్టారెంట్ ను త్వరలోనే ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఈ రెస్టారెంట్ పనులు ప్రస్తుతం చురుగ్గా సాగుతున్నాయని, త్వరలోనే ఓపెనింగ్ ఉంటుందని తెలుస్తోంది.

నిజానికి నితిన్ కు ఈ రెస్టారెంట్ బిజినెస్ అనేది చాలా చిన్నది. తండ్రి సుధాకర్ రెడ్డితో కలిసి నితిన్ ఇప్పటికే హైదరాబాద్ లో బడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నట్టు టాక్. అయితే పెద్ద నోట్ల దెబ్బతో రియల్ ఎస్టేట్ పడిపోవడంతో… మిగతా వ్యాపార అవకాశాల కోసం నితిన్ అన్వేషిస్తున్నాడట. ఇప్పటికే గ్రానైట్ బిజినెస్ లో కూడా అడుగుపెట్టాడట. ఇప్పుడు హోటల్ రంగంలోకి ఎంటర్ అవుతున్నాడట.

Loading...

Leave a Reply

*