బాలయ్య మార్కెట్లోకి నితిన్ ఎంట్రీ

balayya

కేవలం నటుడు మాత్రమే కాదు… నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో కూడా నితిన్ కు టాలెంట్ ఉంది. అందుకే కేవలం తన సినిమాల్ని సినిమాగానే కాకుండా… మార్కెటింగ్ యాంగిల్ లో కూడా చూస్తుంటాడు. మొన్నటివరకు తన సినిమాల నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ మాత్రమే పట్టించుకునే నితిన్.. ఇప్పుడు మిగతా హీరోలపై కూడా ఫోకస్ పెట్టాడు. ఈమధ్యే అఖిల్ తో భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించిన నితిన్… తాజాగా బాలయ్య ప్రతిష్టాత్మక వందో చిత్రంపై కన్నేశాడు.

స్వతహాగా తండ్రి సుధాకర్ రెడ్డి నైజాం ఏరియాలో మంచి పేరున్న డిస్ట్రిబ్యూటర్ కావడంతో నితిన్ అదే బాటలో అడుగులు వేస్తున్నారు. బాలకృష్ణ 100 చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణికి సంబంధించిన… నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను భారీ మొత్తానికి సొంత చేసుకున్నాడు నితిన్. ఆ విషయాన్ని స్వయంగా తనే ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

ఇక సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ హక్కులకు నితిన్ 10కోట్ల 60లక్షల రూపాయలు పెట్టి దక్కించుకున్నట్టు తెలుస్తోంది. అందులో కోటి 60లక్షల రూపాయల్ని రికవరబుల్ ఎమౌంట్ గా చూపినట్టు తెలుస్తోంది. శ్రియ హీరోయిన్ గా… హేమమాలిని మరో కీలక పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకుడు క్రిష్, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకానుంది.

Loading...

Leave a Reply

*