మరోసారి పవన్ హీరోయిన్ తో నితిన్…

untitled-31

పవన్ సినిమా పేర్లు, అందులో సినిమా సాంగ్స్ ను మాత్రమే కాదు… ఇప్పుడు పవన్ హీరోయిన్లను కూడా వాడేస్తున్నాడు నితిన్. మొన్నటివరకు పవన్ మేనరిజమ్స్ ఫాలో అయ్యాడు. అతడి సాంగ్స్ ను రీమిక్స్ చేశాడు. అతడి పాటల్ని సినిమా టైటిల్స్ గా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏకంగా పవన్ సరసన నటించిన బామల్నే కోరుకుంటున్నాడు. ఈ దిశగా ఇప్పటికే సమంతతో అ..ఆ సినిమా చేసిన నితిన్.. ఇప్పుడు గబ్బర్ సింగ్ బ్యూటీ శృతిహాసన్ పై కన్నేశాడు.

అ..ఆ సినిమా తర్వాత నితిన్ రేంజ్ పెరిగింది. అతడి సినిమాలపై ఇంకాస్త ఎక్కువ ఖర్చుపెట్టేందుకు నిర్మాతలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో నితిన్ కు మార్కెట్ పెరగడంతో అతడి సినిమా బడ్జెట్ కూడా పెరిగింది. ఇందులో భాగంగా స్టార్ హీరోయిన్ ను తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అ..ఆ సినిమాలో సమంత లాంటి స్టార్ హీరోయిన్ తో నటించిన నితిన్.. తన నెక్ట్స్ సినిమా కోసం కూడా మరోసారి పవన్ హీరోయిన్ శృతిహాసన్ నే సెలక్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం… నితిన్ నెక్ట్స్ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. 14 రీల్స్ ఎఁటర్ టైన్ మెంట్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో ఇప్పటికే ఓ సినిమా స్టార్ట్ చేశాడు నితిన్. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాలో శృతిహాసన్ ను హీరోయిన్ గా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. పవన్ సరసన కాటమరాయుడు సినిమా చేస్తోంది.

Loading...

Leave a Reply

*