మెగా కాంపౌండ్ వల్ల 2 కోట్లు నష్టపోయాడు…

untitled-1

చాలా ఏళ్ల కిందట ఎమ్ వీ కే రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేశాడు నితిన్. ఈ ఎం.వీ.కే రెడ్డి అంటే ఎవరో కాదు… గతంలో అల్లు అర్జున్ ను హీరోగా పెట్టి బన్నీ అనే సినిమా చేసిన ఎం.సత్యనారాయణరెడ్డికి స్వయంగా కొడుకు. పైగా అటు నితిన్ కూడా రెడ్డీసే కాబట్టి సినిమా ఓకే అయిపోయింది. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ కోసం నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఏకంగా 2కోట్ల రూపాయలు పెట్టారు. అయితే తర్వాత సినిమా ఆగిపోవడం… సదరు ఎం.వీ.కే రెడ్డి మెగా కాంపౌండ్ కు షిఫ్ట్ అయిపోవడం జరిగిపోయాయి.

తనకు రావాల్సిన 2కోట్లు తిరిగి ఇప్పించాల్సిందిగా సుధాకర్ రెడ్డి నిర్మాతల మండలిని ఆశ్రయించాడు. కానీ అప్పటికే ఎంవీకే రెడ్డి మెగా కాంపౌండ్ లో ఉన్నాడు. అల్లు శిరీష్ తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అటు నిర్మాతల మండలిలో చాలామంది మెగా విధేయులే కాబట్టి.. ఎంవీకే రెడ్డి విషయంలో ఎవరూ ఎలాంటి చర్య తీసుకోలేకపోయారు. అలా మెగా కాంపౌండ్ కారణంగా నితిన్ కు 2కోట్లు లాస్ వచ్చిందని టాక్.

అయితే తాజాగా నితిన్ కు మరో అవకాశం దక్కింది. అల్లు శిరీష్ తో సినిమా చేయలేకపోయిన ఎంవీకే రెడ్డి..మెగా కాంపౌండ్ నుంచి బయటకొచ్చారు. ఇదే అదనుగా మరోసారి నిర్మాతల మండలిని ఆశ్రయించాడు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి. మరి ఈసారైనా ఎంవీకే రెడ్డి నుంచి 2కోట్లు తిరిగి వస్తాయా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే నితిన్ కు లాసే.

Loading...

Leave a Reply

*