పాపం… ఈ పాప పరిస్థితి చూస్తే జాలేస్తోంది…

untitled-7

పవన్ సరసన హీరోయిన్ గా నటించడం అంటే మామూలు విషయం కాదు. టోటల్ స్టేట్ అంతా ఆమెనే చూస్తుంది. ఆమె ట్విట్టర్ ఖాతాకు ఫాలోవర్స్ అమాంతం పెరిగిపోతారు. ఆమె ఫేస్ బుక్ లైక్స్ డబుల్ అయిపోతాయి. ఆమె ఎక్కడ కనిపించినా సెల్ఫీల కోసం ఎగబడతారు. గూగుల్ లో టాప్ సెర్చ్ లిస్ట్ లోకి ఆ భామ చేరిపోతుంది. అయితే ఇదంతా పవన్ తో సినిమా సెట్స్ పై ఉన్నంత కాలమే. ఆ తర్వాత కూరలోంచి కరివేపాకును తీసేసినట్టు లిస్ట్ లోంచి సదరు హీరోయిన్ ను తీసేసి పక్కనపడేస్తారు పవనిజం ఫ్యాన్స్.

పవన్ సరసన నటించిన ఎంతోమంది భామల పరిస్థితి ఇదే. ఇప్పుడీ లిస్ట్ లోకి నికీషా పటేల్ కూడా చేరిపోయింది. పవన్ సరసన కొమరం పులి సినిమాకు బుక్ అయిన ఈ బ్యూటీ… తన ఎన్నారై హోదాను కూడా వదులుకుంది. ఆ టైమ్ లో మంచిగానే క్రేజ్ సంపాదించుకుంది. కానీ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత నిక్కీని పట్టించుకున్న నాధుడు లేడు. అలా పూర్తిగా క్రేజ్ కోల్పోయిన నికీషా ఇప్పుడు ఏం చేయాలో తెలియక… వచ్చిన ప్రతి సినిమా ఒప్పేసుకుంటోంది.

పవన్ బ్యూటీ.. సాయిరాం శంకర్ సరసన నటిస్తుందా. కానీ నికీషా మాత్రం అతడితో కలిసి అరకు రోడ్ లో అనే సినిమా చేస్తోంది. ఇక సి-గ్రేడ్ మూవీగా పేరుతెచ్చుకున్న గుంటూరు టాకీస్ సీక్వెల్ లో కూడా కనిపించడానికి ఒప్పుకుంది. మామూలు సాదాసీదా ఫంక్షన్లకు కూడా హాట్ హాట్ గా తయారై వస్తోంది. ఇంత చేసినా నికీషాను ఎవరూ పట్టించుకోవట్లేదు పాపం.

Loading...

Leave a Reply

*