వేణు హీరోయిన్ కు పెళ్లి కుదిరింది…

untitled-61

టాలీవుడ్ లో మరో హీరోయిన్ పెళ్లి పీటలెక్కబోతోంది. ఇప్పటికే అనిత, కామ్న జఠ్మలానీ లాంటి భామలు పెళ్లిచేసుకోగా… సమంత కూడా పెళ్లికి సిద్ధమైంది. ఇప్పుడీ లిస్ట్ లోకి హీరోియన్ నిఖిత కూడా చేరిపోయింది. హాయ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై కళ్యాణ రాముడు, ఖుషి ఖుషీగా, అనసూయ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించిన హీరోయిన్ నిఖిత మూడుముళ్లు వేయించుకోవడానికి రెడీ. ముంబై కు చెందిన పారిశ్రామికవేత్త గగన్ దీప్ సింగ్ మాగోను ఆమె వివాహం చేసుకోనుంది.వివాహానికి సంబందించిన వేడుకలు ఇవాళ్టి నుండే మొదలవుతాయి. ముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్లో శనివారం వివాహం, ఆదివారం రిసెప్షన్ జరగనుంది.

ఈ వివాహ వేడుకకు తెలుగు, తమిళ్, హిందీ పరిశ్రమల నుండి, వ్యాపార రంగం పలువురు ప్రముఖులు హాజరుకున్నారు. నిఖిత ఈ మధ్య తెలుగులో టెర్రర్ సినిమాలో నటించింది. ప్రసుతం ఆమె మలయాళం, కన్నడ భాషల్లో ఒక్కో సినిమా చేస్తోంది. వివాహం అనంతరం తామిద్దరం బహామాస్ కు వారం రోజుల పాటు హానీమూన్ కి వెళుతున్న విషయాన్ని కూడా బయటపెట్టింది నిఖిత.గత డిసెంబర్ లో గగన్ దీప్ తనను కలిశాడని, అప్పడే ప్రేమ చిగురించిందని… మళ్ళీ రెండోసారి కలిసినప్పుడు డైమండ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేసాడని చెప్పింది నిఖిత. రెండు కుటుంబాలు ఒప్పుకోవడంతో తమ వివాహం జరగబోతోందని, తమది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని అంటోంది.

Loading...

Leave a Reply

*