శుభవార్త చెబుతానంటున్న నిఖిల్

untitled-2

ఈమధ్య హీరోలు శుభవార్త చెబుతామంటే చాలు… అందరి ఆలోచనలు ఎటో వెళ్లిపోతున్నాయి. ఏ ప్రేమ వ్యవహారమో లేక పెళ్లి బాజా మేటరో అనుకుంటున్నారంతా. ఇప్పుడు ఆడియన్స్ ఫోకస్ నిఖిల్ పై పడింది. ఎందుకంటే.. ఈ కుర్రహీరో త్వరలోనే ఓ శుభవార్త చెబుతానంటున్నాడు. శంకరాభరణంతో ఫ్లాప్ తెచ్చుకున్న నిఖిల్… ఈ మధ్య మీడియాలో పెద్దగా చప్పుడు చేయడం లేదు. అతడిపై మీడియా ఫోకస్ కూడా తగ్గింది. ఇలాంటి టైమ్ లో ఓ శుభవార్త చెబుతానంటూ నిఖిల్ ప్రకటించడం మీడియా ఎటెన్షన్ కోసమే తప్ప, మేటర్ ఉండని అంటున్నారు చాలామంది.

మరికొందరు మాత్రం ఇది కచ్చితంగా నిఖిల్ పెళ్లి విషయమై ఉంటుందని అంటున్నారు. గతంలో నిఖిల్-స్వాతి ప్రేమించుకుంటున్నట్టు తెగ పుకార్లు వచ్చాయి. ఆ పుకార్లను అప్పట్లో వీళ్లిద్దరూ ఖండించారు కూడా. కాకపోతే రూమర్లు మాత్రం ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో… ఆ యాంగిల్ లోనే నిఖిల్ ఏదైనా శుభవార్త చెబుతాడా అని ఓ సెక్షన్ మీడియా ఎదురుచూస్తోంది.

మరోవైపు నిఖిల్ తన సినిమాలకు సంబంధించిన శుభవార్త చెబుతాడంటున్నారు మరికొందరు. ప్రస్తుతం ఈ హీరో ఎక్కడికి పోతావ్ చిన్నవాడా అనే సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు స్వామిరారా దర్శకుడు సుధీర్ వర్మతో కూడా మరో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో ఒకదానికి సంబంధించిన వార్తను శుభవార్తగా చెబుతాడంటోంది మరో సెక్షన్ మీడియా.

Loading...

Leave a Reply

*