ఎన్టీఆరే కావాలంటున్న మెగా హీరోయిన్‌

untitled-5

జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరో… నెంబ‌ర్ వ‌న్ సింహాస‌నం నాదేనంటూ గ‌ర్జిస్తున్నాడు… తాజాగా ఇండ‌స్ట్రీ హిట్ కొట్టిన తార‌క్ రేసుగుర్రంలా దూసుకుపోతున్నాడు… ఈ క‌త్తిలాంటి కుర్రాడి ప‌క్క‌న హీరోయిన్‌గా న‌టించ‌డానికి అమ్మాయిలు వెర్రెత్తిపోతుంటారు… తాజాగా మెగా హీరోయిన్ కూడా జూనియ‌ర్‌పై మ‌న‌సు పారేసుకుందిట‌.. న‌టిస్తే ఎన్టీఆర్ ప‌క్క‌న హీరోయిన్‌గానే న‌టించాల‌ని క‌ల‌వరిస్తోందిట‌… డాడీ ప్లీజ్‌… ఒక్క‌సారి వెళ్లి మాట్లాడండి… ఎన్టీఆర్ ప‌క్క‌న హీరోయిన్‌గా న‌టించే చాన్స్ ఇప్పించండి అంటూ తండ్రిని తెగ స‌తాయిస్తోంద‌ట‌… ఆయ‌న చెవిలో జోరీగ‌లా రొద చేస్తోందిట‌… అస‌లు విష‌యం ఏంటంటే…తార‌క్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ హీరో.. జ‌న‌తా గ్యారేజ్ సినిమా తాజాగా మా టీవీలో టెలికాస్ట్ అయింది..

ఈ సినిమా టీవీలో వ‌స్తున్న స‌మ‌యంలోనే ఇండియా క్రికెట్‌మ్యాచ్ జ‌రిగింది… మ‌రోవైపు ప్ర‌భాస్ పుట్టిన‌రోజు వేడుక‌లు కూడా జ‌రిగాయి…. అయినా వాట‌న్నింటికి చెక్ పెడుతూ బుల్లి తెర‌పై కూడా త‌డాఖా చూపించాడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌… జ‌న‌తా గ్యారేజ్ సినిమా టీఆర్పీ రేటింగులు అదిరిపోయాయిట‌… ఈ నేప‌థ్యంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టించాల‌ని మెగా హీరోయిన్‌, నాగ‌బాబు కూతురు నీహారిక తెగ ఇదైపోతోందిట‌.. ఆమె తండ్రిని తెగ పోరుతోంద‌ట‌…. చెవిలో ఇల్లు క‌ట్టుకున్న‌ట్టు ప‌దేప‌దే అదే మేట‌ర్ చెబుతోందిట‌.. తార‌క్ సినిమాలో త‌న‌కు హీరోయిన్‌గా చాన్స్ ఇప్పించాల‌ని తండ్రిని కోరుతోందిట‌… ఒక్క చాన్స్‌… ఒకే ఒక్క చాన్స్‌.. ప్లీజ్ డాడీ అంటూ నాగ‌బాబును నీహారిక బ‌తిమాలాడుతోందిట‌….ఒక మ‌న‌సు సినిమా ఫ్లాప్ అయ్యాక ఇప్ప‌టిదాకా మ‌రో సినిమా చేయ‌లేదు ఈ మెగా హీరోయిన్‌…. నీహారిక చాలిక‌…. సినిమాలు వ‌ద్దిక అంటూ నాగ‌బాబు చెబుతున్నా విన‌కుండా తార‌క్ ప‌క్క‌న ఒక్క చాన్స్ ఇప్పించండి డాడీ అంటూ బ‌తిమాలాడుతోందిట‌.

Loading...

Leave a Reply

*