ఇదీ కొత్త లెక్క‌.. బాల‌య్య నెం.1, వెంకీ నెం.2, చిరు.. 3, నాగ్‌.. 4..!

4

ఇదేం ఈక్వేష‌న్ అనుకుంటున్నారా..? టాలీవుడ్‌లో రీసెంట్‌గా సీనియ‌ర్ హీరోల క్రేజ్‌, గ్రాఫ్‌పై ఇచ్చిన స‌ర్వే అనుకుంటున్నారా? అలాంటిదేమీ కాదు. బాక్సాఫీస్ లెక్క‌ల ప‌రంగా కూడా కాదు. కానీ, దీనికీ ఓ లెక్కుంది. అదేంటంటే… దాదాపు ద‌శాబ్దం త‌ర్వాత సీనియ‌ర్ హీరోల సినిమాల‌న్నీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నాయి. చిరంజీవి రీ ఎంట్రీతో దాదాపు నిన్నటిదాకా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ఓ ఊపు ఊపిన హీరోలంతా మరోసారి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రికార్డ్‌ల వేట‌కు బ‌య‌లుదేరారు.

అయితే, ఈ నలుగురు న‌టిస్తున్న సినిమాలన్నీ 2017లోనే విడుద‌ల కానున్నాయి. కానీ, వీరి కొత్త చిత్రాల‌ ఫ‌స్ట్ లుక్‌లు వ‌చ్చేశాయి. ఈ ఫ‌స్ట్ లుక్‌ను చూసిన వారంతా మొద‌ట బాల‌య్య గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణికే ఓటేస్తున్నారు. వైవిధ్య‌మైన ద‌ర్శ‌కుడు క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాల‌య్య చారిత్ర‌క పాత్ర‌లో క‌నిపిస్తున్నాడు. క‌త్తి ప‌ట్టుకొని, త‌ల‌మీద పాగాతో ఓ డిఫ‌రెంట్ లుక్‌లో ఆయ‌న మెస్మ‌రైజ్ చేస్తున్నాడు. శాత‌క‌ర్ణి ట్ర‌యిల‌రే కాదు.. ఫ‌స్ట్ లుక్‌, దీపావ‌ళి లుక్ కూడా అదిరిపోయాయంటున్నారు విశ్లేష‌కులు. అందుకే ఆయ‌న‌కు నెంబ‌ర్ 1 ర్యాంక్ ఇచ్చేస్తున్నారు.

ఇక‌, సెకండ్ ప్లేస్ వెంకీకి క‌ట్ట‌బెట్టారు. గురు చిత్రం కోసం ఆయ‌న కొత్త అవ‌తార్‌లో అద‌రగొడుతున్నాడు. లైట్‌గా తెల్ల‌బ‌డిన గ‌డ్డంతో త‌న ఏజ్‌కి త‌గ్గ రోల్ చేస్తున్నాడు. గురు ఫ‌స్ట్ లుక్ చూసి షాక్ అయిన వారు.. ఈ న్యూ లుక్‌తో మ‌రింత ఫ్లాట్ అవుతున్నారు. మ‌రో డిఫరెంట్ రోల్‌లో వెంకీ త‌ళుక్కున మెర‌వ‌డం ఖాయ‌మంటున్నారు.అంద‌రికంటే ముందు చిరు నిలుస్తాడ‌ని భావించారంతా. రీ ఎంట్రీలో మెగాస్టార్ న‌టిస్తోన్న ఖైదీ నెంబ‌ర్ 150 ఫ‌స్ట్ లుక్‌లో ఆయ‌న సాదాసీదాగా క‌నిపిస్తున్నాడు.

ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌లో ఫ్రెష్‌నెస్ ఏమీ క‌నిపించ‌లేద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చిరు కాస్త స‌న్న‌బ‌డ‌డం మిన‌హా.. చెప్పుకోద‌గిందేమీ లేదంటున్నారు ఎన‌లిస్టులు. సేమ్ టు సేమ్‌.. నాగార్జున ఓం న‌మో వెంక‌టేశాయ లుక్ కూడా ఇలానే ఉందంటున్నారు. గతంలో ఆయ‌న న‌టించిన‌ అన్న‌మ‌య్య సినిమాని గుర్తుకు తెస్తుందంటున్నారు. అందుకే, చిరుకి థ‌ర్డ్ ప్లేస్, నాగ్‌కి 4వ ర్యాంక్ క‌ట్ట‌బెట్టార‌ట‌. మొత్త‌మ్మీద‌, బాల‌య్య రేస్‌లో ముందు నిలిచాడన్న‌మాట‌.

Loading...

Leave a Reply

*