ఆమె కోసం ముంబైకి రానా.. శ్రియాతో స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్‌..!!

untitled-8-copy

రానా.. టాలీవుడ్ హంక్‌. తెలుగు చిత్రసీమ‌లో రీసెంట్‌గా రానా మీద వచ్చిన‌న్ని పుకార్లు మ‌రో హీరో మీద రాలేదు. గాసిప్‌ల‌కు ఆయ‌న కేరాఫ్‌గా మారుతున్నారు. మొన్న త్రిష‌, ఆ త‌ర్వాత మ‌రొక‌రు.. రీసెంట్‌గా శ్రియా..రానా-శ్రియ మ‌ధ్య ఏదో జ‌రుగుతోందంటూ టాలీవుడ్‌లో రూమ‌ర్‌లు వినిపిస్తున్నాయి. గ‌త కొన్నాళ్లుగా ఇద్దరి మ‌ధ్య మంచి రిలేష‌న్ న‌డుస్తోంద‌ని స‌మాచారం. కొంత‌మంది ఇది ప్రేమ అని చెబుతుండ‌గా, మ‌రికొంద‌రు దీనిని జస్ట్ టైమ్ పాస్ అని అంటున్నారు.

అయితే, శ్రియా కోసం రానా ఏకంగా ముంబైకి వెళ్ల‌డం, అక్క‌డ హోట‌ల్స్‌లో ఇద్ద‌రూ క‌లిసి చ‌క్క‌ర్లు కొడుతుండ‌డం అంద‌రికీ షాక్ ఇస్తోంది. ముంబైలోనే కాదు.. రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో జ‌రిగిన రెండు మూడు వేడుక‌ల‌కి కూడా వీళ్లిద్ద‌రూ క‌లిసే వెళ్లార‌ట. అక్క‌డ కూడా క్లోజ్‌గా గడిపార‌ట‌. గ‌త‌కొంత‌కాలంగా ఇద్ద‌రూ చెట్టాప‌ట్టాలేసుకు తిర‌గ‌డం, ఫోటో షూట్‌ల‌కు ఫోజ్‌లు ఇవ్వ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది..

వీరిద్ద‌రిపై గ‌త కొంత‌కాలం నుంచి రూమ‌ర్‌లు వ‌స్తున్నాయి. అయితే, ఇద్ద‌రి మ‌ధ్య ఫ్రెండ్‌షిప్ మిన‌హా మ‌రేదీ లేద‌ని, ఇద్ద‌రం మంచి స్నేహితుల‌మ‌ని వివ‌ర‌ణ ఇచ్చింది శ్రియా. రానాకి, త‌న‌కి కామ‌న్ ఫ్రెండ్స్ బోలెడు మంది ఉన్నార‌ని, అందుకే, ఫంక్ష‌న్‌ల‌కు క‌లిసే వెళుతున్నామ‌నేది ఆమె వాద‌న‌. కానీ, అంత‌కుమించి ఇద్ద‌రూ క‌లివిడిగా ఉండ‌డం అనేక రూమర్‌ల‌కు తావిస్తోంది. మ‌రి, ఇది ఎక్క‌డిదాకా వెళుతుందో అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రానాపై గ‌తంలో వినిపించిన అనేక అఫైర్‌లు లాగా ఇది కూడా రూమర్‌కే ప‌రిమిత‌మ‌వుతుందా…? లేదా? అనేది త్వ‌ర‌లోనే తేల‌నుంది.

Loading...

Leave a Reply

*