న‌మ్ర‌త ధైర్యానికి నెటిజ‌న్‌ల హ్యాట్సాఫ్‌..!

namrata

న‌మ్ర‌త శిరోద్క‌ర్‌.. మ‌హేష్ భార్య‌.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఇప్పుడు ఆమె పేరు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. నెటిజ‌న్‌లు ఆమెకు హ్యాట్సాఫ్ అంటూ జేజేలు ప‌లుకుతున్నారు. ఆమె చేసిన సాహ‌సానికి ఘ‌ట్ట‌మ‌నేని అభిమానులే కాదు.. సోష‌ల్ మీడియాలోని చాలా మంది ఆమెకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.ఇంత‌కీ ఏం చేసింద‌నే క‌దా మీ డౌట్‌..!

అమ్మాయిలు అందం కోసం, గ్లామ‌ర్‌గా క‌నిపించ‌డానికి తెగ ఇంట‌రెస్ట్ చూపిస్తారు. అందం, ఆడ‌వాళ్లను విడ‌దీసి చూడలేం. అందుకే, దేవుడి ద‌గ్గ‌ర మొక్కు ఉన్నా… త‌ల‌నీలాలు స‌మ‌ర్పించ‌డానికి చాలామంది వెనుకాడుతుంటారు. అయితే, స్టార్ హీరో భార్య అయినా.. అందం కంటే దైవ‌భ‌క్తికే ఓటేసింది న‌మ్ర‌త‌. ఇటీవ‌ల ఆమె ఏడుకొండ‌ల వాడిని సంద‌ర్శించుకొని త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు.  అయితే, మొక్కు దేనికోసం అనే సంగ‌తి పక్క‌న‌పెడితే.. దైవ‌భ‌క్తితో న‌మ్ర‌త చేసిన కార్యానికి సూప‌ర్‌స్టార్ అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ఆమెపై కామెంట్స్ రాస్తున్నారు. చాలా మంది న‌మ్ర‌త‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు.

మీరు చాలా గ్రేట్ మేడ‌మ్‌.. వెరీ గుడ్ మేడం.. చాలా మంది తెలుగువాళ్లే గుండు చేయించుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. అలాంటిది ముంబై నుంచి వచ్చిన మీరు.. త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారంటే మీ భ‌క్తి ఎలాంటిదో అర్ధ‌మవుతుంది. ఎంత పెద్ద స్టార్ అయినా.. దేవుడి ముందు అంతా స‌మాన‌మే అని నిరూపించారు అంటూ ఓ నెటిజ‌న్ కామెంట్ పెట్టాడు. మ‌రో నెటిజన్ అయితే.. మాజీమిస్ ఇండియా, సూప‌ర్‌స్టార్ వైఫ్ అయిన మీరు ఇంత సాహ‌సం చేశారంటే గ్రేట్‌. మీరు మంచి త‌ల్లి, భార్య‌, బంధాల‌కు విలువ‌నిచ్చే మ‌హిళ అంటూ రాసుకొచ్చారు. న‌మ్ర‌త మొక్కు సంగ‌తి ప‌క్క‌న‌పెడితే.. ఆమె త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

hqdefault

Loading...

Leave a Reply

*