తార‌క్‌కి శత్రువుల‌ని పెంచిన జ‌న‌తా గ్యారేజ్‌…?

untitled-7

టాలీవుడ్‌లో ఇప్పుడు ఇదే టాక్ వినిపిస్తోంది. జ‌న‌తా గ్యారేజ్‌తో తార‌క్ తిరుగులేని స‌క్సెస్ సాధించాడు. దాదాపు పుష్క‌రకాలం త‌ర్వాత యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ నుంచి వ‌చ్చిన హ్యూజ్ స‌క్సెస్ ఇది. టాలీవుడ్ ఆల్‌టైమ్ టాప్ 3 బ్లాక్ బ‌స్ట‌ర్స్‌లో ఒక‌టిగా నిలిచింది ఈ చిత్రం. అయితే, ఈ సినిమాతో తార‌క్‌కి శ‌త్రువులు పెరిగార‌ట‌. ఎందుకంటే, ఆయ‌న స్టామినా ఏంటో బాక్సాఫీస్‌కి మ‌రోసారి బాగా అర్ధ‌మ‌యింద‌ని, ఇదే ఊపు ప్ర‌ద‌ర్శిస్తే.. టాలీవుడ్ నెంబ‌ర్ గేమ్ మారిపోతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు క్రిటిక్స్‌. దీంతో, తార‌క్‌పై కావాల‌నే నెగిటివ్ ప్ర‌చారం చేస్తున్నార‌ని చెబుతున్నారు.

సినిమా విడుద‌ల‌యిన రోజే… ఫ్లాప్ టాక్ తేవ‌డం జ‌న‌తా గ్యారేజ్‌కి బాగానే డ్యామేజ్ చేసింది. చివ‌రికి మౌత్ టాక్‌తో సాయంత్రానికి సినిమాకి మంచి రెస్పాన్స్ రావ‌డంతో తార‌క్ టీమ్ ఊపిరి పీల్చుకుంది. మొద‌టిరోజే తార‌క్ వ్య‌తిరేక ఫ్యాన్స్ సినిమాపై నెగిటివ్ టాక్ ప్ర‌చారం చేశారనే కామెంట్స్ ఉన్నాయి. దీనికి 30 ల‌క్ష‌ల రూపాయ‌లు కూడా ఇచ్చిన‌ట్లు ఓ ప్ర‌చారం ఉంది.

ఇక‌, రీసెంట్‌గా ఓ టీవీ యాంక‌ర్‌.. తార‌క్‌పై నెగిటివ్ కామెంట్స్ పోస్ట్ చేసిన‌ట్లు సోష‌ల్ మీడియాలో విప‌రీత ప్ర‌చారం జ‌రిగింది. తీరా చూస్తే అది త‌న ప‌ని కాద‌ని, అది ఫేక్ అకౌంట్ అని ఆయ‌న వివ‌ర‌ణ ఇవ్వ‌డంతోపాటు ఎందుకొచ్చిన గోల అని పోలీసుల‌కు కంప్ల‌యింట్ కూడా ఇచ్చారు. ఆ కేసు న‌డుస్తోంది. ఇది కావాల‌నే కొంద‌రు తార‌క్‌ని ఇరుకున పెట్ట‌డానికి, ఆయ‌న ఇమేజ్‌ని, క్రేజ్‌ని డ్యామేజ్ చెయ్య‌డానికే చేసిన ప‌ని అని క్లియ‌ర్‌గా అర్ధం అవుతోంది. ఇది కూడా జ‌నతా గ్యారేజ్ స‌క్సెస్ ప్ర‌భావ‌మేన‌ని అంటున్నారు ట్రేడ్ పండితులు. తార‌క్‌కి ఇలాంటి హిట్స్ మ‌రో రెండు ప‌డితే.. ఆయ‌న పొటెన్షియాలిటీ మ‌రింత పెరుగుతుంద‌ని, అందుకే, ఇలాంటి డ్యామేజ్‌కి పాల్ప‌డుతున్నార‌ని చెబుతున్నారు. మొత్త‌మ్మీద‌, తార‌క్‌కి జ‌న‌తా గ్యారేజ్ విజ‌యం శత్రువుల‌ను పెంచిందన్న‌మాట‌.

Loading...

Leave a Reply

*