పవన్ అయితే నాకేంటి.. – నయన్ వార్నింగ్

nayan

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు జోడీ సెట్ అయిపోయింది. ఆమె నెక్ట్స్ సినిమాలో హీరోయిన్ ఎవరనేది తేలిపోయింది. అయితే ఇక్కడ పవన్ నెక్ట్స్ సినిమా ఏంటనేది క్లియర్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే.. ప్రస్తుతం చేస్తున్న కాటమరాయుడు సినిమాతో పాటు పవన్ ఏకంగా 2 సినిమాలు ప్రారంభించాడు. వీటిలో తమిళ దర్శకుడు నేసన్ సినిమాలో హీరోయిన్ ను తాజాగా ఫిక్స్ చేశారు. ఆమె మరెవరో కాదు నయనతార.

పవన్-నయనతార కాంబినేషన్ చూడ్డానికి చాలా బాగుంటుంది. దర్శకుడు కూడా అదే ఫీలయ్యాడు. అందుకే నయన్ కే మొదట కథ వినిపించాడు. నయన్ కూడా కాల్షీట్లు కేటాయించడానికి రెడీ అయింది. అయితే పవన్ సినిమా కదా మీకు క్రేజ్ వస్తుంది కాస్త డబ్బులు తగ్గించుకోండని నిర్మాత-సమర్పకుడు ఏఎం రత్నం కోరాడట. పవన్ సినిమా అయితే నాకేంటి.. అడిగినంత ఇస్తేనే కాల్షీట్ ఇస్తానని నయన్ తెగేసి చెప్పేసిందట.

అలా దాదాపు 15 రోజులుగా బేరసారాలు సాగించిన తర్వాత.. ఫైనల్ గా నయన్ అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకున్నారట. పవన్ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి నయన్ కు దాదాపు 2 కోట్ల రూపాయలు సమర్పించుకున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన పవన్ సరసన నటిస్తున్న కాస్ట్ లీ హీరోయిన్ గా నయనతార సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు పవన్ హీరోయిన్లు ఎవరూ ఈ రేంజ్ లో ఛార్జ్ చేయలేదు మరి.

Loading...

Leave a Reply

*