మరోసారి టాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది…

untitled-4

అందాలతార నయనతార ఇక టాలీవుడ్ కు టాటా చెప్పేసినట్టే అనుకున్నారు చాలామంది. ఎందుకంటే, శ్రీరామరాజ్యం సినిమా తర్వాత నయన్ పూర్తిగా కోలీవుడ్ కే ఫిక్స్ అయిపోయింది. చాలా తక్కువగా తెలుగులో సినిమాలు చేస్తూ వచ్చింది. తాజాగా వెంకీతో కలిసి బాబు బంగారం సినిమా చేసినప్పటికీ… యూనిట్ చేత 3 చెరువుల నీళ్లు తాగించిందనే రూమర్ ఉండనే ఉంది. ఇవన్నీ పక్కనపెడితే, ఇప్పుడీ బ్యూటీ మరోసారి తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.

తమిళ్ లో ఆమెకు ఫుల్ క్రేజ్ ఉంది. ఆమె కాల్షీట్ల కోసం స్టార్స్ అంతా కాచుక్కూర్చున్నారు. పైగా పారితోషికం కూడా తెలుగుతో పోలిస్తే తమిళ్ లో కాస్త ఎక్కువ. ఇన్ని అడ్వాంటేజెస్ పెట్టుకొని కూడా నయన్ మరోసారి తెలుగులోకి రావాలని అనుకోవడం అందర్నీ షాక్ కు గురిచేస్తోంది. ఈ మేరకు తమిళ్ లో కొన్ని ప్రాజెక్టులు తగ్గించుకొని, తెలుగులో 2 సినిమాలకు కాల్షీట్లు కేటాయించేందుకు నయన్ సిద్ధంగా ఉందని తెలుస్తోంది.

టార్గెట్ టాలీవుడ్ ఆపరేషన్ లో భాగంగా ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో నయన్ చేరినట్టు చెబుతున్నారు. నేసన్ దర్శకత్వంలో పవన్ ప్రారంభించిన కొత్త సినిమాలో నయన్ నే తీసుకునే ఆలోచనలో ఉన్నారట. అటు పవన్ తో పాటు మహేష్ బాబు కు చెందిన ఓ ప్రాజెక్టులో కూడా నయనతార పేరును పరిశీలిస్తున్నారట.

Loading...

Leave a Reply

*