పవన్ పై జాలిచూపించిన నయనతార

untitled-7

ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్లలో ఒకరు నయనతార. ఆమె కాల్షీట్ ఇస్తానంటే భాషతో సంబంధం లేకుండా హీరోలు ఎగబడతారు. నిర్మాతలు బ్లాక్ చెక్స్ ఇవ్వడానికి సిద్ధపడతారు. అలాంటి నయనతారను తమ సినిమాలోకి తీసుకోవాలని దర్శకుడు నేసన్ అనుకున్నాడు. కథ తీసుకెళ్లి నయనతారకు వినిపించాడు కూడా. ఇంతకీ ఆ కథలో హీరో ఎవరో తెలుసా… పవన్ కల్యాణ్. అవును.. పవన్ స్టోరీనే నయనతారకు వినిపించాడు. డేట్స్ ఇవ్వమని ప్రాధేయపడ్డాడు.

పవన్ సరసన నటించడానికి ఎవరైనా ఓకే చెబుతారు. నయనతార కూడా వెంటనే ఓకే చెప్పేసింది. ఇన్నాళ్లుగా ఎవరి సినిమాలో నటించాలని ఎదురుచూస్తోందో.. ఆ హీరో సినిమా ఆఫర్ రావడంతో నయన్ ఇక ఆలోచించలేదు. వెంటనే కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేసిందని తెలుస్తోంది. అయితే ఇక్కడ పవన్ పై తన అభిమానాన్ని మరో రూపంలో కూడా చూపించుకుందట నయనతార. పవన్ సినిమా చేయాలనే కోరికతో.. తన రెమ్యూనరేషన్ ను కూడా తగ్గించుకుందట.

సాధారణంగా సినిమాకు 2 కోట్ల రూపాయలు తీసుకుంటుంది నయనతార. లాంగ్వేజ్ ఏదైనా 2కోట్లు సమర్పించుకోవాల్సిందే. కానీ ఇక్కడ పవన్ సినిమా. అందుకే పవర్ స్టార్ కోసం ఏకంగా తన పారితోషికాన్ని కోటి 20లక్షలకు కుదించుకుంది ఈ భామ. ఈ మేరకు నయనతారను ఒప్పించడంలో నిర్మాత ఏఎం రత్నం హండ్రెస్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు.

Loading...

Leave a Reply

*