నంద‌మూరి బంధువుని తొక్కేసిన నాని, రామ్‌, చైతు..!

nani-ram-and-chaitu

నాని, రామ్‌, చైతు.. యువ హీరోల‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. రెయిజింగ్ హీరోల‌లో వీరిదే హ‌వా. ఈ ముగ్గురూ క‌లిసి నంద‌మూరి బంధువుని తొక్కేస్తున్నారు. ఇంత‌కీ ఆయ‌న‌ ఎవ‌ర‌నుకుంటున్నారా..? నారా రోహిత్ కాదు.. నాగ‌శౌర్య‌ని. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఎందుకంటే, బాల‌య్య చిన్న అల్లుడు శ్రీధ‌ర్‌కి, నాగ‌శౌర్య ఫ్యామిలీకి మంచి రిలేష‌న్స్ ఉన్నాయి. శ్రీధ‌ర్ తాత‌య్య, వైజాగ్ మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తికి నాగ‌శౌర్య కుటుంబానికి ద‌గ్గ‌రి చుట్ట‌రికం ఉంది. ద‌స‌రా సీజ‌న్‌లో ఈ ముగ్గురు హీరోలు క‌లిసి నాగ‌శౌర్య‌కి స్పాట్ పెట్టారు.

నాగ‌శౌర్య లేటెస్ట్ మూవీ నీ జ‌త‌గా. ఈ మూవీ అక్టోబ‌ర్ 1 కానుక‌గా విడుద‌ల‌యింది. ఈ సినిమాకి స‌రైన ప్ర‌మోష‌న్ లేదు. ఈ ఏడాది నాగ‌శౌర్య‌కి మంచి హిట్‌లు వ‌చ్చాయి. క‌ల్యాణ వైభోగ‌మే, జ్యో అచ్యుతానంద సినిమాల‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. అలాంటి హీరో నుంచి మూవీ వ‌స్తుందంటే అంచ‌నాలు వేరేగా ఉంటాయి. కానీ, నీ జ‌త‌గా మూవీ నామ‌మాత్ర‌పు ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో విడుద‌ల అయింది. ఎందుకంటే, ఇది ఆయ‌న కెరీర్ ప్రారంభంలో చేసిన చిత్రం.

ద‌స‌రా సీజ‌న్ కావ‌డంతోపాటు, జ్యో అచ్యుతానంద స‌క్సెస్ కావ‌డంతో నీ జ‌తగా మూవీకి రెక్క‌లు వ‌చ్చాయి. ఆ సినిమా నిర్మాత‌లు దీనిని క్యాష్ చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.ద‌స‌రా బ‌రిలో నాని మ‌జ్ను, రామ్ హైప‌ర్‌, నాగ‌చైత‌న్య ప్రేమ‌మ్ చిత్రాలు వ‌స్తుండ‌డంతో నాగ‌శౌర్య నీ జ‌త‌గా రేస్‌లో వెనుకబడింది. ఇటు, స‌రైన ప్ర‌మోష‌న్ లేక‌, టీజ‌ర్‌, ట్ర‌యిల‌ర్‌లోనూ క‌నెక్ట్ అయ్యే కంటెంట్ లేక‌.. డీలా ప‌డింది. మరి, నాగ‌శౌర్య నీజ‌త‌గా చిత్రం స‌ర్‌ప్రైజ్ స‌క్సెస్‌ను సొంతం చేసుకుంటుందా? లేదా? అనేది త్వ‌ర‌లోనే తేల‌నుంది.

Loading...

Leave a Reply

*