షాకింగ్‌… పెళ్ల‌యిన అమ్మాయి వెంట ప‌డుతున్న నాని…!

untitled-11
పాపం నాని. ప్రేమించాడు. పెళ్లి చేసుకుందామ‌నుకున్నాడు. కానీ, ఊహించ‌ని విధంగా త‌న ల‌వ‌ర్‌కి మ‌రొక‌రితో పెళ్ల‌యింది. అయినా, ఆయ‌న వ‌దిలి పెట్ట‌డం లేదు. ఆ పెళ్లయిన అమ్మాయినే కావాలంటున్నాడు. ఏకంగా ఆ అమ్మాయి ఇంటిలోనే తిష్ట‌వేసి ఆమెతోనే జీవితాన్ని పంచుకుంటానంటున్నాడు. దానికి ఆ అమ్మాయి స‌సేమిరా అన్నా.. వినిపించుకోడ‌ట‌. నో చెప్పినా లైట్ తీసుకుంటున్నాడ‌ట‌. ఇదేంటి షాకింగ్ ట్విస్ట్ అనుకుంటున్నారా..?
నానిది ల‌వ్ మ్యారేజ్‌. మ‌రి, ఆయ‌న‌కు ఈ వ్య‌వ‌హారం అంతా ఏంటి అనుకుంటున్నారా….? ఇది రియ‌ల్ కాదు. రీల్‌. సినిమా కోసం. నాని ప్ర‌స్తుతం ఓ సినిమాకి సైన్ చేశాడు. డివివి దాన‌య్య నిర్మిస్తున్న  ఈ సినిమాకి ఓ కొత్త ద‌ర్శ‌కుడు వ‌ర్క్ చేస్తున్నాడు. ఆయ‌న ఎవ‌ర‌నేది త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. ఇది ప‌క్కా వ‌న్ సైడ్ ల‌వ్ మూవీ అట‌. ఆర్య‌లా స్ట‌యిలిష్ కాకుండా, అభినంద‌న‌లా టూ ఎమోష‌న్ కాకుండా.. ఓ వైవిధ్య‌మైన క‌థ‌, క‌థ‌నంతో ఈ సినిమాకి తెర‌కెక్కిస్తార‌ట‌.
నానికి అమ్మాయిల‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమాతో అది బాగా పెరిగింది. దీంతో, ఇది ఆయ‌న‌కు బాగా ఆప్ట్ అవుతుంద‌ని భావిస్తున్నార‌ట ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. ఈ సినిమా క‌థ తెలిస్తేనే ఇంట‌రెస్టింగ్‌గా ఉంది.. మ‌రి, ఎలాంటి ట్విస్ట్‌లు వ‌స్తాయో చూడాలి.
Loading...

Leave a Reply

*