రాశిఖ‌న్నాపై నోరు జారిన నాని.. ఉతికి ఆరేసిన జాతీయ మీడియా..!

nani-and-rashi

నాని.. వైవిధ్యమైన కేర‌క్ట‌ర్‌లు.. విలక్ష‌ణ న‌ట‌న‌.. వెర‌సి.. తక్కువ టైమ్‌లోనే టాలీవుడ్‌లో అంద‌రి ప్ర‌శంస‌లు పొంది రెయిజింగ్ హీరోల లిస్ట్‌లో ముందున్నాడు. ఇటు, ఆయ‌న మంచి మాట‌కారి కూడా. యువ హీరోల‌తో గుడ్ రిలేష‌న్స్ కూడా ఉన్నాయి. అల్ల‌రిన‌రేష్, మంచు మ‌నోజ్‌, శ‌ర్వానంద్‌, రామ్‌, రాజ్ త‌రుణ్‌.. ఇలా ఏ ఒక్క‌రి ఆడియో ఫంక్ష‌న్ జ‌రిగినా..అక్క‌డ నాని త‌ప్ప‌నిస‌రిగా ఉంటాడు. ఎందుకంటే, మంచి మనిషి, మృదుస్వ‌భావిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయ‌న రీల్ జెంటిల్‌మ‌న్ కాదు.. రియ‌ల్ జెంటిల్‌మ‌న్ కూడా.

అయితే, రీసెంట్‌గా ఆయ‌న ఓ వివాదంలో చిక్కుకున్నాడు. హైప‌ర్ ఆడియో ఫంక్ష‌న్‌లో నాని రాశిఖ‌న్నా గ్లామ‌ర్‌పై కాస్త ఎక్కువ‌గానే హాట్ కామెంట్స్ చేశాడు. ఆయ‌న ఏమ‌న్నాడంటే.. “రాశి నువ్వు అందంగా క‌నిపిస్తున్నావ్‌.. ఇంత‌కుమించి పదాలు చెప్పాల‌ని అనిపిస్తున్నా.. నీట్‌గా ఉండ‌ద‌ని చెప్ప‌లేక‌పోతున్నా.. అయితే, ఈ ఫంక్ష‌న్‌కి వ‌చ్చిన‌వాళ్లు.. నువ్వు ఎంత అందంగా క‌నిపిస్తున్నావు అని నీవైపే చూస్తున్నారు“ అంటూ రాశి ఖ‌న్నా గ్లామ‌ర్‌పై జోకులేశాడు.

హైప‌ర్ ఆడియో వేడుక‌కి రాశి కాస్త ఓవ‌ర్ ఎక్స్‌పోజింగ్ చేసే డ్ర‌స్‌లోనే వ‌చ్చింది. కానీ, నాని ఇలా వ్యాఖ్యానించ‌డం మాత్రం అసంబ‌ద్ధంగా ఉంది. మ‌హిళ‌ల డ్ర‌స్‌లు, వారిపై ఇటీవ‌ల టాలీవుడ్ సెల‌బ్రిటీలు చేస్తున్న కామెంట్స్‌పై ఓ ఆంగ్ల మీడియా సంచ‌ల‌న క‌థ‌నం రాసింది. మొన్న ఆలీ, ఆ త‌ర్వాత బాల‌య్య.. నేడు నాని… ఇలా మ‌న తెలుగు హీరోలు మ‌హిళ‌ల‌పై చేస్తున్న వ్యాఖ్య‌లు పెనుదుమారం రేపుతున్నాయి. దీంతో, నానిలాంటి హీరో కూడా ఇలా మాట్లాడ‌డం ఏంటి?అంటూ ఆ ప‌త్రిక ఆయ‌న‌పై దుమ్మెత్తిపోసింది. మ‌రి, ఈ వివాదంతో ఆయ‌న ఆమెకు సారీ చెబుతాడా? క‌నీసం వివ‌ర‌ణ అయినా ఇస్తాడా?  లేక లైట్ తీసుకుంటాడా..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

 

Loading...

Leave a Reply

*