ఇద్దరు హీరోలు వద్దంటే, నాని ఒప్పుకున్నాడు…

untitled-6

వేణు శ్రీరాం గుర్తున్నాడా… ఈ దర్శకుడు ఓ కథ రాసుకున్నాడు. అది ఎలాంటి కథ అనేది ఎవరికీ తెలీదు. కానీ హీరోలు మాత్రం ఆ కథ విన్నాక తప్పుకుంటూనే ఉన్నారు. ఇప్పటికే రవితేజ, నాగార్జున ఆ కథ విన్నారు. మొదట సినిమా చేయడానికే ఒప్పుకున్నారు. కానీ తర్వాత తప్పుకున్నారు. అలాంటి కథతో ఇప్పుడు సినిమా చేయడానికి నాని రెడీ అవుతున్నాడు. వేణు శ్రీరాం చెప్పిన కథకు మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రవితేజ. ఆమధ్య ఇదే కథతో రవితేజ సినిమా ఓకే చేశాడు. ఆ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఇక సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అనుకుంటున్న టైంలో సడెన్ గా ప్రాజెక్టు నుంచి రవితేజ తప్పుకున్నాడు. కారణం మాత్రం తెలీదు.

ఆ తర్వాత ఇదే కథకు నాగార్జున కూడా ఓకే చేసి తప్పుకున్నాడు. ఈ ఇద్దరు హీరోలు కేవలం రెమ్యూనరేషన్ సమస్యలతోనే తప్పుకున్నట్టు గతంలో వార్తలొచ్చాయి. కానీ నాని మాత్రం ఇదే కథకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.దిల్ రాజు నిర్మాతగా నాని హీరోగా వేణు శ్రీరాం దర్శకత్వంలో ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందని అంటున్నారు. మరి ఈసారైనా ఈ కథకు మోక్షం కలుగుతుందా అనేది చూడాలి. అయితే ఇంతమంది హీరోలు రిజెక్ట్ చేసిన ఈ కథలో ఏముందనే క్యూరియాసిటీ మాత్రం ఇప్పుడు అందర్లో పెరిగింది. పైగా నాని ఒప్పుకోవడంతో అది సమ్ థింగ్ స్పెషల్ స్టోరీనే అయి ఉంటుందని ఫిక్స్ అయిపోయారు.

Loading...

Leave a Reply

*