నందిని న‌ర్సింగ్ హోమ్ రివ్యూ & రేటింగ్‌..!

untitled-20

మూవీ. నందిని న‌ర్సింగ్ హోమ్‌

తారాగ‌ణం.. న‌వీన్ విజ‌య్‌కృష్ణ‌, శ్రావ్య‌,నిత్య‌, ష‌క‌ల‌క శంకర్‌, వెన్నెల కిషోర్‌, స‌ప్త‌గిరి, జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి త‌దిత‌రులు

మ్యూజిక్‌. అచ్చు

నిర్మాత‌లు.. రాధాకిషోర్‌, భిక్ష‌మ‌య్య‌

ద‌ర్శ‌క‌త్వం.. పి.వి. గిరి

సీనియ‌ర్ హీరో న‌రేష్ వార‌సుడు నవీన్ కృష్ణ న‌టించిన తొలి చిత్రం నందిని న‌ర్సింగ్ హోమ్‌. ప్ర‌ముఖ న‌టి విజ‌య‌నిర్మల మ‌న‌వ‌డు. మ‌హేష్‌బాబు ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన మ‌రో వార‌సుడు న‌వీన్ కృష్ణ‌. న‌వీన్ తెరంగేట్రం మూవీ కావ‌డంతోపాటు మ‌హేష్ ఆడియోకి స్పెష‌ల్ గెస్ట్‌గా రావ‌డంతో సినిమాపై అంద‌రి ఫోక‌స్ ప‌డింది. హార‌ర్ కామెడీ చిత్రాల ట్రెండ్ ప‌డిపోయింద‌నుకున్న టైమ్‌లో వ‌చ్చిన ఆ జాన‌ర్ మూవీ నందిని న‌ర్సింగ్ హోమ్‌. మ‌రి, ఈ సినిమా క‌థేంటి..? తొలి సినిమాతోనే న‌వీన్ కృష్ణ హీరోగా నిల‌దొక్కుకున్నాడా..? ఆయ‌న న‌ట‌న ఎలా ఉంది.? న‌ందిని నర్సింగ్ హోమ్ హిట్టా..? ఫ‌ట్టా? అనేది తెలియాలంటే రివ్యూపై ఫోక‌స్ వేయాల్సిందే.

స్టోరీ..
చందు (న‌వీన్ విజ‌య్ కృష్ణ‌) ఓ సాధార‌ణ కుర్రాడు. ఓ బ్యాంక్‌లో లోన్ రిక‌వ‌రీ సెక్ష‌న్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. తాను ఉండే రూమ్ ప‌క్క‌నే ఉన్న లేడీస్ హాస్ట‌ల్‌లో ఉండే అమూల్య (శ్రావ్య‌)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమె కూడా అత‌నిని ఇష్ట‌ప‌డుతుంది. అయితే, చందూ జాబ్ పోతుంది. అమూల్యతో బేదాభిప్రాయాలు వ‌చ్చి ఆమె కూడా దూర‌మ‌వుతుంది. అప్ప‌టినుంచి ప్రేమ‌పై న‌మ్మ‌కం కోల్పోతాడు చందూ. అమ్మాయిలంటేనే డేంజ‌ర్ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటాడు. జాబ్‌కోసం త‌న ఫ్రెండ్ నాయుడు (ష‌క‌ల‌క శంక‌ర్‌)సాయంతో నందిని న‌ర్సింగ్ హోమ్‌లో చేర‌తాడు. న‌కిలీ స‌ర్టిఫికెట్‌లు సృష్టించి డాక్ట‌ర్‌గా ఉద్యోగాన్ని సంపాదిస్తాడు.

అయితే, హాస్పిట‌ల్ య‌జ‌మాని కూతురు నందిని (నిత్య‌) చందూని ప్రేమిస్తుంది. మరి, ఆ త‌ర్వాత ఏమ‌యింది..? ఆయ‌న ఫేక్ శంక‌ర్ దాదా అని తెలుస్తుందా? చందూ ఎవ‌రినిపెళ్లి చేసుకుంటాడు..? అమూల్య‌నా? నిత్య‌నా? అస‌లు నందిని న‌ర్సింగ్ హోమ్‌లో ఏ జ‌రుగుతుంది..? అందులో నిజంగా దెయ్యం ఉందా? లేదంటే దాని వెనుక ఉన్న మిస్ట‌రీ ఏంటి..? ఇదే అస‌లు క‌థ‌. దీనిని తెర‌పై చూడాల్సిందే.క్రైమ్ కామెడీ కథ‌తో తెర‌కెక్కింది నందిని న‌ర్సింగ్ హోమ్‌. మొద‌ట రొమాంటిక్ ఎంట‌ర్‌ట‌యిన‌ర్‌గా సాగుతున్న క‌థ‌కి, ఇంట‌ర్వెల్ సీన్‌కి వ‌చ్చేసరికి హార‌ర్‌కామెడీగా మారుతుంది. దీంతో, లాజిక్ మిస్ అయిన‌ట్లుగా అనిపించినా.. సినిమాలో వెన్నెల కిషోర్‌, ష‌క‌ల‌క శంక‌ర్ కామెడీ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. దీంతో స‌ర‌దాగా టైమ్‌పాస్ అవుతుంది. కొన్ని కామెడీ సీన్‌ల‌ను ద‌ర్శ‌కుడు బాగా తెర‌కెక్కించాడు. న‌వ్విస్తూనే ఉన్నాడు. ఇది రిపీట్ ఆడియెన్స్‌ను తెప్పించే చాన్స్ ఉంది. టోట‌ల్‌గా స‌ర‌దా స‌ర‌దాగా సాగిపోతుంది నందిని నర్సింగ్ హోమ్‌.

తొలి సినిమానే అయినా నవీన్ విజ‌య్ కృష్ణ బాగా చేశాడు. అటురొమాంటిక్ యాంగిల్‌లోనూ, ఇటు కామెడీ, స‌స్పెన్స్‌లో వ‌చ్చే ఎమోష‌న్స్‌లోనూ విజ‌య్ కృష్ణ పెర్‌ఫార్మెన్స్‌కి మంచి మార్కులే ప‌డుతున్నాయి. గ‌తంలో ఎడిట‌ర్‌గా ఉండి అంద‌రి న‌ట‌న ద‌గ్గ‌రుండి బాగా ప‌రిశీలించిన‌ట్లున్నాడు. తెరంగేట్రం మూవీలో ఎక్స్‌ప్రెష‌న్స్ బాగా ప‌లికించాడు. ఫ‌స్ట్ హాఫ్‌లో సోసోగా సాగిన క‌థ‌.. సెకండాఫ్‌కి వ‌చ్చే సరికి వేగం పుంజుకుంటుంది. ఫేక్‌డాక్ట‌ర్‌గా వ‌చ్చే సీన్‌ల‌తోపాటు హాస్పిట‌ల్‌లో దెయ్యం సీన్‌లు సినిమాకి ఆయువుప‌ట్టుగా మారాయి. ఏకంగా డాక్ట‌ర్‌ల‌పైనే సాగే హ‌త్యాయ‌త్నాలతో క‌థ‌లో థ్రిల్ బాగా న‌డిపించాడు ద‌ర్శ‌కుడు గిరి. ఇక‌, వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకి హైలైట్‌గా మారింది. ప్రేమ‌క‌థా చిత్ర‌మ్‌లో స‌ప్త‌గిరి సినిమాని ఎలా క్యారీ చేశాడో.. ఈ మూవీలో వెన్నెల కిషోర్ ఆ బాధ్య‌త‌ను స‌మ‌ర్ధ‌వంతంగా న‌డిపించాడంటున్నారు ప్రేక్ష‌కులు.

క‌థ‌లో అక్క‌డ‌క్క‌డా కాస్త లాగ్ ఉన్నా.. ద‌ర్శ‌కుడు దానిని బాగానే అధిగ‌మించాడు. కామెడీతో దానిని కవ‌ర్ చేశాడు. క‌థ ప‌రంగా ఉన్న ప‌రిమితులను కూడా ఆ హాస్యంలో ప‌డి ప్రేక్ష‌కుడు మ‌రిచిపోయేలా చేశాడు. హీరోయిన్‌లు ఇద్ద‌రూ ప‌ర్లేద‌నిపించారు. ఇక‌, చైన్ స్నాచ‌ర్‌గా వెన్నెల కిషోర్‌, మేల్ న‌ర్స్‌గా ష‌క‌ల‌క శంక‌ర్ ఆక‌ట్టుకున్నారు. ఇటు, జాత‌కాల పిచ్చి ఉన్న సీనియ‌ర్ డాక్ట‌ర్‌గా జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి రోల్ బాగా క‌నెక్ట్ అవుతుంది. చాలా గ్యాప్ తర్వాత జ‌య‌ప్ర‌కాష్ రెడ్డికి మంచి రోల్ ద‌క్కింది. స‌ప్త‌గిరి కూడా ఆక‌ట్టుకునే పాత్ర ద‌క్కించుకున్నాడు.

శ్రీకాకుళం యాసతో మాట్లాడే ష‌క‌ల‌క శంక‌ర్ డైలాగ్‌లు, కోమాలో ఉన్న పేషంట్‌గా వెన్నెల కిషోర్‌ నటన మంచి ఎంట‌ర్‌టెయిన్‌మెంట్‌ని అందిస్తాయి. శివేంద్ర కెమెరా పనితనం.. శేఖర్‌ చంద్ర.. అచ్చు సంగీతం ఆకట్టుకుంటుంది. కథలో బోలెడన్ని ట్విస్ట్‌లు ఉన్నప్పటికీ ఎక్కడా గందరగోళం లేకుండా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు గిరి. లాజిక్‌ మిస్‌ కావటమే సినిమాకు కాస్త డిజ‌ప్పాయింట్ అని చెప్పొచ్చు. ఆ విషయాన్ని వదిలేస్తే.. సినిమా అద్యంతం నవ్వుల జల్లే.

బాట‌మ్‌లైన్‌.. స‌క్సెస్‌ఫుల్ న‌ర్సింగ్ హోమ్‌..!
రేటింగ్‌… 2.75/5

Loading...

Leave a Reply

*