నందమూరి టీజర్ వెర్సెస్ మెగా టీజర్

untitled-56

థియేటర్లలో కాదు.. దసరా రోజున నందమూరి నాయకుడికి, మెగా హీరోకు మధ్య వార్ నడిచింది. ఇద్దరు స్టార్లు పోటాపోటీగా తమ టీజర్లు విడుదల చేశారు. దసరా పర్వదినాన సమరానికి సై అన్నారు. ఒకరేమో ఉదయం ముహూర్తం చూసుకొని మరీ టీజర్ రిలీజ్ చేస్తే, మరొకరు సాయంత్రం ముహూర్తానికి టీజర్ విడుదల చేశారు. మొత్తమ్మీద నందమూరి బాలకృష్ణ చేస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణి, చెర్రీ నటిస్తున్న ధృవ సినిమా టీజర్లు ఒకేసారి మార్కెట్లోకి వచ్చాయి. మరి వీటిలో దేనిది పైచేయి.

అభిమానులు వాదులాడుకుంటున్నట్టు నిజానికి ఈ రెండు టీజర్లలో కంపేరిజన్స్ పెట్టలేం. ఎందుకంటే రెండూ వేటికవే డిఫరెంట్ జానర్స్ కు చెందిన సినిమాలు. వందల ఏళ్లనాటి కథతో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తెరకెక్కుతుండగా… కంప్లీట్ యాక్షన్ ఎడ్వెంచరస్ మూవీగా థృవ సినిమా రూపొందుతోంది. సో.. ఈ రెండు సినిమాల మధ్య పోలికలు తేవడం కష్టం. అయితే ఈ రెండు సినిమాల కామన్ ఎలిమెంట్ మాత్రం ఒక్కటే. అదేంటంటే.. ఈ రెండూ యాక్షన్ మూవీసే.

సినిమాల మధ్య పోలికల సంగతి అటుంచితే… హీరోల లుక్స్ విషయంలో మాత్రం చాలా పోలికలున్నాయి. శాతకర్ణి గెటప్ లో బాలయ్య లుక్ కు పెద్దగా రెస్పాన్స్ రాలేదనే చెప్పాలి. అటు ఐపీఎస్ ఆఫీసర్ గా చెర్రీ మాత్రం సిక్స్ ప్యాక్ బాడీతో బాగానే ఆకట్టుకున్నాడు. ఇక డైలాగ్స్ పరంగా రెండు టీజర్లు కిక్ ఇచ్చాడు. శరణమా..రణమా అంటూ బాలయ్య అదరగొడితే… శత్రువుతోనే కెపాసిటీ తెలుస్తుందని చెర్రీ ఇరగదీశాడు.

Loading...

Leave a Reply

*