నంద‌మూరి అల్లుడికి నంద‌మూరి అబ్బాయ్ సెగ‌..!

nandamuri-kalyan-ram-upperhand-over-nara-rohith-at-box-office

ఈ వీక్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర హాట్ ఫైట్ సాగింది. నంద‌మూరి ఫ్యామిలీ హీరోల సినిమాలే రెండు విడుద‌ల‌య్యాయి. క‌ల్యాణ్‌రామ్ ఇజంతోపాటు, నారా రోహిత్ శంక‌ర కూడా ఈ వీకెండ్ కానుక‌గానే థియేట‌ర్ల‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. అయితే, గ‌తంలో ఎన్న‌డూ ఇలా వీరి సినిమాలు ఒకేసారి రిలీజ్ కాలేదు. కానీ, ఇలా విడుద‌ల‌వ‌డంతో నంద‌మూరి ఫ్యాన్స్ ఎటు స‌పోర్ట్ చెయ్యాలో తెలియ‌క కాస్త తిక‌మ‌క‌ప‌డ్డార‌ట‌.

ఆ సంగ‌తి ప‌క్క‌న‌పెడితే.. నంద‌మూరి అబ్బాయ్ వ‌ర్సెస్ నంద‌మూరి అల్లుడుగా సాగిన వార్‌లో క‌ల్యాణ్‌రామ్‌దే పైచేయిగా క‌నిపిస్తోంది. క‌ల్యాణ్‌రామ్ ఇజంకి పూరి జ‌గ‌న్నాథ్ వంటి బ‌డా డైరెక్ట‌ర్ కావ‌డంతోపాటు, కల్యాణ్‌రామ్ మార్కెట్ కూడా పెద్ద‌ది కావ‌డం క‌లిసొచ్చింది. ఇటు, ఎన్టీఆర్ కూడా సినిమా ప్ర‌మోష‌న్‌ని ద‌గ్గ‌రుండి ప్లాన్ చేశాడు. దీంతో, ఇజందే మొద‌ట అప్ప‌ర్ హ్యాండ్ సాధించింది. బ‌డ్జెట్ ప‌రంగా కూడా ఈ మూవీదే ఆధిప‌త్యం. ఇక,నారా రోహిత్ శంక‌ర సినిమా ఇప్ప‌టిది కాదు. పాత‌ది. కానీ, లేట్‌గా ఇప్పుడు విడుద‌ల‌యింది. శంక‌ర చిత్రం ఎలాంటి హంగామా లేకుండా రిలీజ్ అయింది. ప‌బ్లిసిటీ ప‌రంగా కూడా వీక్‌గా ఉంది ఇజంతో కంపేర్ చేస్తే. శంక‌ర చిత్రం రీమేక్ అవ‌డం కూడా మైన‌స్ అయిందంటున్నారు ట్రేడ్ విశ్లేష‌కులు. త‌మిళ్‌లో హిట్ అయిన ఓ సినిమాకి ఇది రీమేక్.. అయినా స‌క్సెస్‌ఫుల్ ఫ్లాట్‌ని హిట్‌గా మ‌లుచుకోవ‌డంలో నారా రోహిత్ ఫెయిల‌య్యాడు.

కంటెంట్ ప‌రంగా కూడా ఇజం అంద‌రికీ బాగా క‌నెక్ట్ అయింది. తొలి షో నుంచే క‌ల్యాణ్‌రామ్‌-పూరి ఇజంకి హిట్ టాక్ వ‌చ్చింది. సినిమాలో క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఎక్కువ‌గా ఉన్నా, పూరి నారేష‌న్‌గా వీక్ అనిపించినా.. టోట‌ల్‌గా సినిమాకి గుడ్ అప్లాజ్ ద‌క్కుతోంది. అయితే, అంద‌రి ఫోక‌స్ ఇజం మీదే ప‌డ‌డంతో నారా రోహిత్ శంక‌ర తేలిపోయింద‌ని సినీజ‌నాలు చెవులు కొరుక్కుంటున్నారు. మ‌రోవైపు, జ్యో అచ్యుతానంద మూవీతో పెరిగిన క్రేజ్‌ని నారా రోహిత్ క్యాష్ చేసుకోవ‌డంలో ఫెయిల‌య్యాడనే చెప్పాలి. మొత్తమ్మీద‌, నంద‌మూరి అల్లుడి మీద పైచేయి సాధించాడు నంద‌మూరి అబ్బాయ్‌.

Loading...

Leave a Reply

*