ఆటోడ్రైవర్ వెనక నమిత పరుగులు

namitha

తమిళ తంబీల ఆరాధ్య దేవత నమిత. ప్రస్తుతం ఆమె సినిమాలు తగ్గించినా, తమిళ జనాలు మాత్రం నమిత బొద్దుతనాన్ని, ఆమె అందాల ఆరోబోతను మరిచిపోలేరు. కొంతమందైతే నమితకు గుడి కట్టి రోజూ పూజలు కూడా చేస్తున్నారు. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకే నమిత ఇప్పుడు రాజకీయాల్లో చేరింది. వచ్చే మరో మూడేళ్లలో జరగబోయే ఎన్నికల్లో చక్రం తిప్పేందుకు పాపులు కదుపుతోంది. ఇందులో భాగంగా సినిమాలు కూడా తగ్గించేసింది.

సినిమాలు తగ్గించేసిన నమిత… ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వీలైనంత ఎక్కువగా ప్రజలతో గడిపేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఇందులో భాగంగా ఓ ఆటోడ్రైవర్ తో ఆమె సెల్ఫీ దిగడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడమే కాదు.. తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా కూడా మారింది. జయలలిత ఆరోగ్య పరిస్థితి తర్వాత, ఎక్కువమంది నమిత సెల్ఫీ గురించే మాట్లాడుకునేలా చేసింది.

నిజమే ఇక్కడ విశేషం ఏమిటంటే నమిత చెన్నైలోని మాణిక్యం రోడ్డులో కారులో వస్తుండగా ఎదురుగ ఓ ఆటో వచ్చిందట, ఆ ఆటోని నడుపుతుంది మహిళా కావడంతో వెంటనే ఆటోని ఆపించి .. ఆటో డ్రైవర్ అయిన మహిళతో నమిత సెల్ఫీ దిగింది ? అది విషయం !! ఆ ఆటో డ్రైవర్ తన కుటుంబ పోషణ కోసం ఇలా ఆటో నడుపుతున్నందుకు అభినందించిందట నమిత.

Loading...

Leave a Reply

*