స‌మంత‌కు నిక్‌నేమ్ పెట్టిన నాగ్ టీమ్‌…!

nag-and-sam

సమంత నాగ్ ఫ్యామిలీలో పూర్తి మెంబ‌ర్ కాలేదు. ఆ ఇంట్లో కోడ‌లిగా అడుగుపెట్ట‌లేదు. కానీ, పెద్ద కోడ‌లిగా పాదం మోప‌డానికి ముందే ఆమెను త‌మ ఇంటి య‌జ‌మానురాలుగా, కాబోయే త‌మ బాస్‌గా భావిస్తున్నార‌ట నాగ్ స్టాఫ్‌. అందుకే, ఆమెకు ఓ నిక్ నేమ్ కూడా ఇచ్చేశార‌ట‌. ఆమెను ఇప్ప‌టినుంచే అలా అని పిలుస్తున్నార‌ట‌. రాబోయే నాలుగ‌యిదు నెల‌ల త‌ర్వాతయినా పిల‌వాలి క‌దా అని ఇప్ప‌టినుంచే ప్రిపేర్ అయ్యి చుల్‌బులీకి మంచి పేరు కూడా పెట్టేశార‌ట‌.

ఇంత‌కీ ఏంట‌నే క‌దా మీ డౌట్‌..? చిన్న మేడ‌మ్‌.. అవును, స‌మంత‌ను నాగ్ స్టాఫ్ అంతా క‌లిసి చిన్న మేడ‌మ్ అని పిలుస్తున్నార‌ట‌. అంటే, అమ‌ల ఎప్ప‌టినుంచో వారికి మేడ‌మ్‌. తాజాగా ఆమె ఇంటికి కోడ‌ళ్లు వ‌స్తుండ‌డంతో ఆమె పెద్ద మేడ‌మ్‌గా ప్ర‌మోష‌న్ కొట్టేశారు. స‌మంత‌కు చిన్న మేడ‌మ్ అని సంబోధిస్తున్నార‌ట‌. అయితే, ఆ ఇంటికి ఇంకా అఖిల్ కోడ‌లు అడుగుపెట్ట‌లేదు. అఖిల్ కూడా త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఫ్యాష‌న్ డిజైన‌ర్ శ్రీయాని మ‌నువాడ‌బోతున్నాడు. మ‌రి ఆమెను ఏమ‌ని పిలుస్తుందో చూడాలి నాగ్ స్టాఫ్‌.

నాగ్ మాత్రం త‌న కాబోయే పెద్ద కోడ‌లిని అమ్మ అని పిలుస్తాడ‌ట‌. ఎందుకంటే, ఈ ఇద్ద‌రూ క‌లిసి న‌టించిన మ‌నం మూవీలో నాగ్‌కి త‌ల్లి పాత్ర‌లో క‌నిపించింది చుల్‌బులీ. అలా, అప్ప‌టినుంచి ఆమెను అమ్మ అని పిల‌వ‌డం అల‌వాటుగా మారింద‌ట‌. అంతేకాదు, గ‌తేడాది స‌మంత మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌యింది. అప్పుడు కూడా స‌మంత‌ని అమ్మ అనే సంబోధించ‌డం మ‌నం చూశాం. అయితే, చైతు ఆమెను ఏమ‌ని పిలుస్తాడో….? అనేది ఇంట‌రెస్టింగ్‌గా మారింది.

Loading...

Leave a Reply

*