నాగార్జున ఇలా షాక్ ఇచ్చాడేంటి.. పోయి పోయి ఆ సినిమా ఒప్పుకున్నాడు..!

nagarjuna

నాగార్జున ఊహించ‌ని షాక్ ఇచ్చాడు. గ‌త కొంత‌కాలంగా వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో, విల‌క్ష‌ణ న‌ట‌న‌తో మెప్పిస్తూ వ‌స్తున్న మ‌న్మ‌ధుడు తాజాగా మ‌రో డిఫ‌రెంట్ మూవీకి సైన్ చేశాడు. మ‌నం, సోగ్గాడే చిన్ని నాయ‌న‌, ఊపిరి వంటి చిత్రాల‌తో వ‌ర‌స విజ‌యాలు అందుకున్న మ‌న్మ‌ధుడు.. ప్ర‌స్తుతం ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఓం న‌మో వెంక‌టేశాయ సినిమా చేస్తున్నాడు. ఇది గ‌తంలో చేసిన పాత్రే. కానీ, ఇప్పుడు అంత‌కు మించి వెరయిటీ రోల్‌కి ఓకే చేశాడు. అదేంటంటే.. ఆత్మ‌గా దెయ్యం రోల్ పోషించ‌నున్నాడు నాగ్‌.

గ‌తేడాది సంచ‌ల‌న విజ‌యం సాధించిన ఓమ్‌కార్ మూవీ రాజు గారి గ‌ది సీక్వెల్‌లో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఇది షాకింగ్ విష‌యం. చిన్న సినిమాగా వ‌చ్చి భారీ లాభాలు ఆర్జించి పెట్టింది. ఈ మూవీని నిర్మించింది, స‌హాయం చేసింది కూడా నాగ్ స‌న్నిహిత మిత్రుడు, బిజినెస్ పార్ట్‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ప్రసాద్ కావ‌డం విశేషం. అందుకే, ఓంకార్ మ‌లి మూవీకి నాగార్జున సైన్ చేశాడ‌ని చెబుతున్నారు. క‌థ‌, క‌థ‌నంలో ఓంకార్ శైలి న‌చ్చ‌డంతోనే నాగ్ రాజు గారి గ‌ది సీక్వెల్‌కి ఓటేశాడ‌నేది విమ‌ర్శ‌కుల మాట‌.

ఇటీవ‌ల నాగ్‌.. వైవిధ్య‌మైన క‌థ‌లు ఎంచుకుంటున్నాడు. వాటితోనే విజయాలు అందుకుంటున్నాడు. ఓం న‌మో వెంక‌టేశాయ వంటి ఆధ్యాత్మిక చిత్రం త‌ర్వాత భ‌క్తుడిగా చేసి ఆ వెంట‌నే దానికి పూర్తి భిన్న‌మైన ఆత్మ‌, దెయ్యం నేప‌థ్యం సినిమాకి ఒప్పుకోవ‌డం విశేషం. టోట‌ల్‌గా ఆయ‌న మ‌రో డిఫ‌రెంట్‌.. మూవీకి సైన్ చేశాడ‌న్న మాట‌.

Loading...

Leave a Reply

*